April 18, 2026

చేపల జగడం రంగనాయకసాగర్ రిజర్వాయర్ లో చేపల పట్టే హక్కుని తేల్చని అధికారులు, మత్స్య కారులు ముదిరాజ్ ల మధ్య వివాదం.చేపలు పట్టేందుకు ప్రయత్నిస్తే జరిమానా కుల సంఘం తీర్మానం

0
IMG-20260313-WA1391

చిన్నకోడూర్,మార్చి 13: రంగ నాయక సాగర్ రిజర్వాయర్
లో చేపల వేట విషయంలో మత్స్య కారులు ముదిరాజ్ ల మధ్య వివాదం నెలకొంది. చేపలు పట్టే హక్కు తమదంటే తమదని మత్స్య కారులు లైసెన్స్ దారులు వాదిస్తుండగా.. అధికారులు ఏటు తేల్చకుండా మీన మేషాలు లెక్కిస్తున్నారు. దీనికి తోడు రంగ ప్రవేశం చేసిన కుల సంఘాల పెద్దలు చేపలు పట్టేందుకు ప్రయత్నిస్తే లక్ష రూపాయల జరిమానా అంటూ చేసిన తీర్మానం హాట్ టాపిక్ గా మారింది. కాళేశ్వరం ప్రాజెక్టు లో భాగంగా చిన్నకోడూరు మండలం పరిధిలో చంద్రాపూర్ వద్ద రంగనాయక సాగర్ రిజర్వాయర్ ను 3 టీఎంసీల సామర్థ్యం తో నిర్మించారు. గత కొన్ని సంవత్సరాలుగా రిజర్వాయర్ పూర్తి సామర్థ్యం మేరకు గోదావరి జలాలతో నింపు తున్నారు. అదే విధంగా ఉచిత చేపలు పిల్లలను ప్రతి సంవత్సరం అధికారులు రిజర్వాయర్ లో వదలు తున్నారు. చేపలు పట్టే హక్కుల కోసం చిన్నకోడూర్, పెద్దకోడూర్, చంద్లాపూర్ పూర్, రామంచ, లింగారెడ్డి పల్లి తో పాటుగా మరికొన్ని గ్రామాలకు చెందిన మత్స్య కారులు లైసెన్స్ ల కోసం మత్స్య శాఖ అధికారులకు దరఖాస్తు చేసున్నారు. ఈమేరకు రామంచ,
చంద్రాపూర్ గ్రామాలకు చెందిన మత్స్య కారులకు మాత్రమే లైసెన్స్ లు జారీ చేయడం గమనార్హం. దీంతో రిజర్వాయర్ లోని చేపలు పట్టుకునే విషయంలో లైసెన్స్ దారులకు ముదిరాజ్ లకు మద్య వివాదం తలెత్తింది. చేపలు పట్టే హక్కు మాదంటే మాదని ముదిరాజులు, లైసెన్స్ దారులు వాదిస్తుండ టంతో వివాదం అధికారులకు తలనొప్పిగా మారింది. మార్చి 10 వ తేదీ న ముదిరాజ్ సంఘాలకు చెందిన ప్రతినిధులు చేపలు పట్టేందుకు నల్గొండ జిల్లాకు చెందిన గుత్తే దారులను తీసుకొచ్చారు. దీంతో లైసెన్స్ దారులు అక్కడి చేరుకొని చేపలు పట్టుకునే హక్కు లైసెన్స్ దారులకు మాత్రమే ఉంటుందని ముదిరాజ్ సంఘాల ప్రతినిధులతో వాదించారు. ఈ వివాదం అధి కారులకు తెలియడంతో హుటాహుటిన రంగనాయక సాగర్ రిజర్వాయర్ కు చేరుకున్న మత్స్య శాఖ అధికా రులు ఇరువర్గాల ను శాంతింప చేశారు. వెంటనే రంగ ప్రవేశం చేసిన కుల సంఘాల పెద్దలు ఒప్పందం చేశారు. రంగనాయక సాగర్ రిజర్వాయర్ లో ఎవరు చేపలు పట్టిన ఆయా గ్రామాలకు చెందిన సంఘాలదే బాధ్యతగా నిర్ణయించారు. ఈ ఒప్పందం ఎవరు ఉల్లం ఘించినా లక్ష రూపాయల జరిమానా విధిస్తామని హుకుం జారీ చేశారు.లైసెన్స్ జారీలో అధికారుల నిర్లక్ష్యం..?మత్స్య కారులకు చేపలు పట్టే లైసెన్స్ ల జారీలో మత్స్య శాఖ అధికారులు నిర్లక్ష్యం వహించడమే వివాదానికి కారణమని కుల సంఘాల పెద్దలు ఆరోపిస్తున్నారు.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed