ఏప్రిల్ 10 జల్ పల్లి: శ్రీరామ కాలనీలో రోడ్లపై చెత్త వేయకూడదని మరియు శ్రీరామ కాలనీ పరిశుభ్రంగా ఉంచుకోవాలని మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఇంటింటికి పంచే కరపత్రం విడుదల చేశారు శ్రీ రామా కాలనీ బస్తి వాసులు. ప్రతిరోజు రోడ్లమీద చెత్తని ఎక్కడపడితే అక్కడ పారవేస్తూ రోడ్లన్నీ డంపింగ్ యార్డ్ లాగా మారుస్తున్నారని పలువురు తెలియజేశారు. “మనం నివసించే ప్రాంతాలని మనం శుభ్రంగా ఉంచుకోవాలీ” అని అన్నారు మున్సిపల్ కార్పొరేషన్ సూపరేజర్ కుమార్ మరియు కాలనీవాసులు. కొంతమంది బయటి రాష్ట్రం వాళ్లు ఉదయాన్నే చెత్తని రోడ్లమీద పారవేస్తూ రోడ్లని పూర్తిగా చెత్తలా మారుస్తున్నారు. ఎప్పటికప్పుడు మున్సిపల్ కార్పొరేషన్ కార్మికులు చెత్తని తీస్తున్న ఉదయం లేచే సరికి పూర్తిగా డంపింగ్ యార్డ్ లాగా మారుతున్నాయి అని అన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కార్పొరేషన్ కార్మికులు మరియు సూపర్వైజర్, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.
ఏప్రిల్ 6 బాసర:తదూరి మనసా. బాసర జ్ఞాన సరస్వతి ఆలయ పునర్నిర్మాణం పనులకు సిఎం రెవంత్ రెడ్డి సోమవారం భూమి పూజ చేశారు. హైదరాబాదు నుండి ప్రత్యేక హెలికాప్టర్లో బాసరకు చేరుకున్నారు. అనంతరం అమ్మవారు ఆలయంలో మనమడి అక్షరాభ్యాసం పూర్తి అయిన తర్వాత, ఆలయ పుర నిర్మాణం కోసం మంజూరు చేసిన 225 కోట్ల రూపాయల పనులను డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో కలిసి భూమి పూజ చేశారు. అలాగే ముధోల్ కు 200 కోట్లరుపాయల తో నిర్మించనున్న ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ , కాంప్లెక్స్ కు అక్కడే శంకుస్థాపన చేశారు. ఆలయ పూజారుల వేదమంత్రోచరణల మధ్య ఆలయ పునర్ నిర్మాణ పనులను సీఎం ప్రారంభించారు. ముందుగా గడ్డ పారతో తవ్వి, ఇసుక, సిమెంట్ మిశ్రమాన్ని వేశారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, జిల్లా ఇంఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎంపి గొడం నగేష్, ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, ఎమ్మెల్సీ కొమరయ్య, దండె విఠల్ , ఎమ్మెల్యే లు రామారావు పటేల్, బొజ్జు పటేల్, మహేశ్వర్ రెడ్డి, కలెక్టర్ అభిలాష అభినవ్, మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి,మాజీ ఎమ్మెల్యేలు, నారాయణరావు పటేల్, విట్టల్ రెడ్డి, రేఖ శ్యామ్ నాయక్, స్థానిక సర్పంచ్ తీగల వెంకటేష్ గౌడ్, ప్రజా ప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, తదితరులు, పాల్గొన్నారు.
Leave a Reply
రంగారెడ్డి జిల్లా ఏప్రిల్ 02: హైదరాబాద్:తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అభివృద్ధి చేస్తున్న భారత్ ఫ్యూచర్ సిటీ పరిధిలో కొనసాగుతున్న నిర్మాణ పనులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా పరిశీలించారు.ఈ సందర్భంగా ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ అథారిటీ ( ఎఫ్ సి డి ఎ) కార్యాలయ భవన నిర్మాణ పురోగతిని సమీక్షించిన సీఎం,ప్రాజెక్ట్ రూపకల్పనలపై అధికారులతో చర్చించి పలు కీలక సూచనలు చేశారు.నిర్మాణ పనులు నాణ్యతతో పాటు వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు.అలాగే యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ( వై ఐ ఎస్ యు)కి సంబంధించిన భవన సముదాయాలను సందర్శించిన ఆయన,పనుల పురోగతిపై సంతృప్తి వ్యక్తం చేస్తూనే మరింత వేగవంతం చేయాలని సూచించారు.సమీక్ష సందర్భంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ సుబ్బారావు తదితర అధికారులు సీఎం వెంట పాల్గొన్నారు.
Leave a Reply
మహేశ్వరం ఏప్రిల్ 1: మహేశ్వరం నియోజకవర్గం రామకృష్ణ పురం డివిజన్ లో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వంలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమం రెండు కండ్లుగా భావించి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ముందు వెళుతున్న సదర్భంగా RK పురం డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పున్న గణేష్ నేత గారు, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు చిలుక ఉపేందర్ రెడ్డి_ గార్ల ఆధ్వర్యంలో, మాజీ శాసన సభ్యులు మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ బాధ్యులు కిచ్చేన్నగారి లక్ష్మారెడ్డి (KLR) గారు, TPCC ప్రతినిధి దేప భాస్కర్ రెడ్డి (DBR) గార్ల సమక్షంలో బీజేపీ పార్టీ RK పురం డివిజన్ ప్రధాన కార్యదర్శి కందుకూరి సుదర్శన్, మాజీ వార్డ్ సభ్యుడు గుణగంటి రమేష్ గౌడ్, NTR నగర్ ఫేజ్ -II అధ్యక్షుడు కర్రే రవి గార్లకు కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పి కాంగ్రెస్ పార్టీలోకి హృదయ పూర్వకంగా ఆహ్వానించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ:👉రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో సామాన్యుడికి అందుతున్న సంక్షేమ పథకాలు మరియు అభివృద్ధిని చూసి ఇతర పార్టీల నేతలు స్వచ్ఛందంగా కాంగ్రెస్ వైపు వస్తున్నారని పేర్కొన్నారు.👉 బీజేపీ నాయకత్వంపై నమ్మకం కోల్పోయి, ఆ పార్టీలోని క్రియాశీలక నాయకులు బయటకు వస్తున్నారని, రాబోయే రోజుల్లో మహేశ్వరంలో బీజేపీ నామరూపాలు లేకుండా పోతుందని వారు విమర్శించారు.👉 పార్టీలో చేరిన వారికి సరైన గుర్తింపునిస్తామని, ప్రతి కార్యకర్తను గుండెల్లో పెట్టుకుని కాపాడుకుంటామని హామీ ఇచ్చారు. అందరం కలిసికట్టుగా పనిచేసి మహేశ్వరాన్ని అభివృద్ధిలో అగ్రగామిగా నిలుపుతామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఏఎంసీ డైరెక్టర్ బండి మధుసూదన్ రావు ఖిల్లా మైసమ్మ దేవాలయం చైర్మన్ సురేష్ యువజన కాంగ్రెస్ పార్టీ నాయకులు ముప్పిడి లింగస్వామి గౌడ్, బొడ్డుపల్లి మహేందర్, పగడాల ఎల్లయ్య, రాజు నాయక్,వెంకటేశ్వర్లు,జ్ఞానేశ్వర్ యాదవ్,దుబ్బాక శేఖర్,యాదవ రెడ్డి,అక్బర్, శేఖర్ ముదిరాజ్,అల్లేటి కిరణ్, మహమ్మద్, భూపాల్ రెడ్డి,షఫీ,పాష పటేల్,నబీ, సమ్మద్, రేణుక, మాధవి, ఈశ్వరమ్మ, పార్వతమ్మ, లావణ్య, స్వరూపం, మరియు తదితరులు పాల్గొన్నారు.
Leave a Reply
మార్చి 28 భద్రాచలం:భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి పట్టాభిషేక మహోత్సవం శనివారం అంగరంగ వైభవంగా సాగింది.గవర్నర్ శ్రీ శివ ప్రతాప్ శుక్లా, వారి సతీమణి శ్రీమతి జానకి శుక్లా ఈ వేడుకకు హాజరై సీతారాముల వారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరావు, ఎంపీ బలరాం నాయక్, ఎమ్మెల్యే వెంకట్రావు, గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం. దాన కిషోర్, దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు ఈ ఉత్సవాన్ని తిలకించారు.
గవర్నర్ కు స్వాగతం పలికిన ప్రజా ప్రతినిధులు, అధికారులు
భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి పట్టాభిషేక మహోత్సవంలో పాల్గొనేందుకు తొలిసారి వచ్చిన తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శ్రీ శివ ప్రతాప్ శుక్లా , వారి సతీమణి శ్రీమతి జానకి శుక్లా లకు ప్రజా ప్రతినిధులు , అధికారులు ఘన స్వాగతం పలికారు.
బూర్గంపాడు మండలం సారపాకలోని ఐటీసీ హెలీప్యాడ్ వద్ద మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, భద్రాచలం ఎమ్మెల్యే డా. తెల్లం వెంకట్రావు, కలెక్టర్ అంకిత్, ఎస్పీ రోహిత్ రాజు శాలువా, పుష్పగుచ్ఛం అందజేసి గవర్నర్ స్వాగతం పలికారు.
భద్రగిరి మార్ట్ ను ప్రారంభించిన గవర్నర్
ఈ సందర్భంగా గవర్నర్ ఐటిడిఎ ఆధ్వర్యంలో భద్రాచలంలో – భద్రగిరి మార్ట్ ను గవర్నర్ శ్రీ శివ ప్రతాప్ శుక్లా ప్రారంభించారు.
మార్ట్ లో విక్రయానికి ఉంచిన గిరిజన ఉత్పత్తుల గురించి భద్రాచలం ఐటిడిఎ ప్రాజెక్ట్ అధికారి బి రాహుల్, సహాయ ప్రాజెక్ట్ అధికారి (జనరల్) డేవిడ్ లు గవర్నర్ కు వివరించారు. గిరిజన ఉత్పత్తులను పరిశీలించి, పలు ఉత్పత్తులను గవర్నర్ దంపతులు కొనుగోలు చేశారు.
Leave a Reply
ఎవరెన్ని విమర్శలు, అడ్డంకులు సృష్టించినా మూసీ నది ప్రక్షాళన పూర్తి చేసి తీరుతామని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు స్పష్టం చేశారు. మానవ తప్పిదాల వల్ల గొప్ప చరిత్ర కలిగిన హైదరాబాద్ కనుమరుగయ్యే ప్రమాదం నుంచి కాపాడి భవిష్యత్తరాలకు అత్యద్భుతమైన నగరాన్ని అందించాలన్నదే ప్రభుత్వ సంకల్పమని చెప్పారు.
✅మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్టులో భాగంగా మూసీ తీరం గండిపేట – మంచిరేవులలోని చారిత్రక వీరభద్రస్వామి ప్రాంగణంలో శ్రీ మచిలేశ్వర స్వామి, శ్రీ ఓంకారేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణానికి ముఖ్యమంత్రి గారు భూమిపూజ నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో గోవు పూజ నిర్వహించి గోశాలను ప్రారంభించారు. శ్రీ మచిలేశ్వర స్వామి వారికి అభిషేకం నిర్వహించారు.
✅ 1400 ఏండ్ల చరిత్ర కలిగిన ఈ పురాతన ఆలయాన్ని 8 ఎకరాల్లో దాదాపు 700 కోట్ల వ్యయంతో పునర్నిర్మాణం, అభివృద్ధి కార్యక్రమాలకు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గారితో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ..
✅ “మూసీ ప్రక్షాళన చేయడమన్నది ఇప్పుడు నిత్యావసర వస్తువులకన్నా అత్యవసరం. పరీవాహక ప్రాంతాన్ని మన సంస్కృతి, సంప్రదాయాలకు నిలయంగా, ప్రత్యేకమైన ధ్యానమందిరాలతో ఒక అద్భుతమైన పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయబోతున్నాం.
✅ అక్కడి సూర్యుడు ఇక్కడ పొడిచినా ప్రాజెక్టును పూర్తి చేస్తాం. ఇది మా దీక్ష. మూసీ నది ప్రక్షాళనతో పాటు దక్షిణ కాశీగా రాణించే విధంగా ఈ పుణ్యక్షేత్రాన్ని పునర్నిర్మిస్తాం. రామప్ప ఆలయ నమూనాను ఇక్కడ నిర్మించాలని సంకల్పించాం. ఇది యథాలాపంగా చేస్తున్నది కాదు. దైవేచ్ఛతో సాగుతున్న కార్యక్రమంగా భావిస్తున్నాం. అందరూ ఆశీర్వదించాలి. సహకరించాలి.
✅ చరిత్రను గమనించినప్పుడు నదీ పరీవాహన ప్రాంతాలు, సముద్ర తీరాల్లోని ప్రాంతాలు అభివృద్ధిని సాధించాయి. తెలంగాణ సముద్రతీరం లేని రాష్ట్రం. రాష్ట్రంలో కృష్ణా, గోదావరి, ఈసా నదులున్నా ఆ జలాలను సరిగా వినియోగించుకోకపోవడం వల్ల కొన్ని తరాలు నష్టపోయాయి.
✅ దేశ రాజధాని ఢిల్లీ నగరం కాలుష్యంతో జనజీవనం స్తంభించిపోయింది. రాష్ట్రపతి, ప్రధానమంత్రులు ఉండే ఢిల్లీలో యమునా నది కాలుష్యమై పారుతోంది. కాలుష్యం కారణంగా సెలవులు ప్రకటించడం, పెట్టుబడులు తరలిపోవడం వంటి పరిస్థితుల నుంచి మనం నేర్చుకోవలసిన అవసరం ఉందా లేదా.
✅ హైదరాబాద్ నగరం మత సామరస్యానికి ఒక వేదిక. మూసీ ప్రక్షాళనలో భాగంగా అత్యధిక ప్రాధాన్యత కలిగిన చార్మినార్ మక్కా మసీదు ప్రాంతంలో అద్భుతమైన మసీదును, గౌలిగూడ ప్రాంతంలో సిక్కు చరిత్ర ఉంది. స్వర్ణ దేవాలయంలాంటి దేవాలయం నిర్మాణం, ఉప్పల్ నాగోల్ ప్రాంతంలో అద్భుతమైన చర్చి నిర్మించబోతున్నాం.
✅ వర్షాకాలంలోనే కాకుండా నిరంతర నీటి ప్రవాహం, నగర ప్రజల తాగునీరు, పరిశ్రమల అవసరాలను తీర్చడానికి గోదావరి నుంచి 20 టీఎంసీలను తరలిస్తున్నాం. మూసీ పరీవాహక ప్రాంత ప్రజాప్రతినిధులందరూ నదిని ప్రక్షాళన చేయాల్సిందేనని కోరుతున్నారు. ఖర్చుతో కూడుకున్నది అయినప్పటికీ మంత్రివర్గ సహచరుల సహకారంతో ముందుకు వెళుతున్నాం.
✅ ఈ ప్రాజెక్టును అడ్డుకోవాలని కొందరు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో కేసు వేశారు. ప్రాంత ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా ప్రాజెక్టును అడ్డుకునే ప్రయత్నం చేయొద్దు. కేసును ఉపసంహరించుకోవాలి..” అని కోరారు.
✅ ఈ కార్యక్రమంలో ఎంపీ వేం నరేందర్ రెడ్డి గారు, ఎమ్మెల్యేలు ప్రకాష్ గౌడ్ గారు, కాలె యాదయ్య గారు, కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారు, ఇతర ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణా రావు గారు, డీజీపీ శివధర్ రెడ్డి గారు, MRDCL ఎండీ ఈవీ నర్సింహారెడ్డి గారితో పాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Leave a Reply
న్యూ డిల్లీ 28:చమురు సంక్షోభం కారణంగా దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్ విధించబోతుందన్న వార్తలు సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం అవుతున్న నేపథ్యంలో కేంద్ర పెట్రోలియం మరియు సహజ వాయువు శాఖ మంత్రి హర్‌దీప్ సింగ్ పురీ స్పందించారు. ఈ ప్రచారాల్లో ఎలాంటి నిజం లేదని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వానికి లాక్‌డౌన్ విధించేలా ఎలాంటి ప్రతిపాదన లేదని ఆయన తెలిపారు. ప్రజలు నిర్ధారణ లేని సమాచారాన్ని నమ్మి ఆందోళన చెందవద్దని సూచించారు. దేశంలో చమురు సరఫరా మరియు పరిస్థితులపై ప్రభుత్వం సమగ్రంగా నిఘా ఉంచుతోందని ఆయన పేర్కొన్నారు.
Leave a Reply
మార్చి 27 జల్ పల్లి: శ్రీరామ కాలనీలో మార్చి 27న పోచమ్మ దేవాలయం దగ్గర కాలనీవాసుల ఆధ్వర్యంలో చలివేంద్రo ప్రారంభించారు గణపతి చించోలే. కాలనీవాసులు సందర్భంగా మాట్లాడుతూ పోచమ్మ ఆలయం దగ్గర గత కొన్ని నెలలుగా కొంతమంది చెత్తను వేస్తూ అక్కడ ఉన్న ప్రాంతాన్ని మొత్తం చెత్తాచెదారంగా చేస్తున్నారని అన్నారు. జల్ పల్లి మున్సిపల్ కార్పొరేషన్ అధికారుల సహకారంతో మార్చి 27న చలివేంద్రం ఏర్పాటు చేసి దాహం తీర్చే కార్యక్రమం నిర్వహించారు కాలనీవాసులు. కార్యక్రమంలో గణేష్ చించోలే, మారిపల్లి రవీందర్, మారిపల్లి సూర్యకిరణ్, మారిపల్లి మోక్షిత్, మారిపల్లి ప్రణీత్, సంతోష్ పాటిల్, మదన్ పాటిల్, దామోదర్, మల్లేష్, పుట్ట బాబు, (మెకానిక్) అభిషేక్, సంగమేశ్వర్, కుమార్ (జిహెచ్ఎంసి జల్ పల్లి సూపర్వైజర్) నరేందర్, గుర్రం మహేష్ తదితరులు పాల్గొన్నారు.
Leave a Reply
మార్చి 26 సిరసనగండ్ల చారగొండ: శిరసనగండ్ల (గట్టు జాతర) శ్రీరామనవమికి కళ్యాణ మహోత్సవం, పెద్దతేరు, పూలతేరు, రాముల వారి కళ్యాణం ప్రత్యేకమైన చరిత్ర ఉన్నది గట్టు జాతరకి శ్రీరామనవమి అంటే జాతరలలో ప్రత్యేకమైనది శిరస్సునగండ్ల గట్టు జాతర రాముల వారి కళ్యాణం తలంబ్రాలు చూడముచ్చటగా ఉంటుంది చుట్టుపక్కల గ్రామాల నుండి వేలాదిమంది తరలివచ్చి శ్రీ సీతారాముల వారి కళ్యాణం తిలకించి తలంబ్రాలు తీసుకొని వెళ్తారు. శ్రీ సీతారాముల వారి తలంబ్రాలు పంట పొలాలలో చల్లితే వారి పంటలు పుష్కలంగా పండుతాయి అని ఒక నమ్మకం భక్తులకి. శిరసానగండ్ల గ్రామానికి గట్టు జాతరకి ఒక చరిత్ర ఉన్నది. రాములవారి గుడి కోసం చుట్టుపక్కల ఎన్నో గ్రామాలు గుడి తమకు సొంతమంటూ తమకు సొంతమని చెప్పుకుంటూ ఉంటారు. కానీ గ్రామాలు గ్రామాలు కొట్లాటలు జరగంగా గుడి చివరికి సిరసనగండ్ల గ్రామానికి సొంతం అయ్యింది. శిరసానగండ్లలో పద్మశాలీలు శావ మోస్తారు (దేవుని పల్లకి) వడ్రంగిలు రథం యొక్క పనులు చూసుకుంటారు, గ్రామాల్లో ఉన్న పలు కులాలకి శిరిసనగండ్ల జాతర ప్రత్యేక స్థానం కల్పిస్తుంది దేవాలయం లో.
Leave a Reply
మార్చి 25 హైదరాబాద్: పశ్చిమాసియాలో తలెత్తిన సంక్షోభం నేపథ్యంలో రాష్ట్రంలో పెట్రోల్, గ్యాస్ సిలిండర్లు (ఎల్ పీజీ), యూరియా నిల్వలపై ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు అత్యవసర ఉన్నతస్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు శాసనసభ కమిటీ హాలులో మంత్రులు, ఉన్నతాధికారులతో పరిస్థితిని సమీక్షించనున్నారు. రాష్ట్రంలో ఇంధన సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా, అలాగే పెట్రోల్, గ్యాస్ కొరత తలెత్తకుండా నిల్వల నిర్వహణ, ముందస్తు జాగ్రత్తలపై సమావేశంలో సమీక్షించనున్నారు.
చెత్తని ఎక్కడపడితే అక్కడ వేయకూడదని కరపత్రం ఆవిష్కరించారు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారుల ఆధ్వర్యంలో శ్రీరామ కాలనీ వాసులు
బాసర ఆలయ పున నిర్మాణానికి సీఎం భూమి పూజ
భారత్ ఫ్యూచర్ సిటీలో అభివృద్ధి పనులపై సీఎం సమీక్ష
మహేశ్వరంలో బీజేపీకి భారీషాక్: KLR మరియు DBR సమక్షంలో కాంగ్రెస్లోకి చేరికల జోరు. బీజేపీ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి భారీ చేరికలు
భద్రాచలంలో అంగరంగ వైభవంగా శ్రీరాముని పట్టాభిషేకం.పట్టాభిషేక మహోత్సవం తిలకించిన రాష్ట్ర గవర్నర్ శ్రీ శివ ప్రతాప్ శుక్లా దంపతులు