భద్రాచలంలో అంగరంగ వైభవంగా శ్రీరాముని పట్టాభిషేకం.పట్టాభిషేక మహోత్సవం తిలకించిన రాష్ట్ర గవర్నర్ శ్రీ శివ ప్రతాప్ శుక్లా దంపతులు
మార్చి 28 భద్రాచలం:భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి పట్టాభిషేక మహోత్సవం శనివారం అంగరంగ వైభవంగా సాగింది.గవర్నర్ శ్రీ శివ ప్రతాప్ శుక్లా, వారి సతీమణి శ్రీమతి జానకి శుక్లా ఈ వేడుకకు హాజరై సీతారాముల వారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరావు, ఎంపీ బలరాం నాయక్, ఎమ్మెల్యే వెంకట్రావు, గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం. దాన కిషోర్, దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు ఈ ఉత్సవాన్ని తిలకించారు.
గవర్నర్ కు స్వాగతం పలికిన ప్రజా ప్రతినిధులు, అధికారులు
భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి పట్టాభిషేక మహోత్సవంలో పాల్గొనేందుకు తొలిసారి వచ్చిన తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శ్రీ శివ ప్రతాప్ శుక్లా , వారి సతీమణి శ్రీమతి జానకి శుక్లా లకు ప్రజా ప్రతినిధులు , అధికారులు ఘన స్వాగతం పలికారు.
బూర్గంపాడు మండలం సారపాకలోని ఐటీసీ హెలీప్యాడ్ వద్ద మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, భద్రాచలం ఎమ్మెల్యే డా. తెల్లం వెంకట్రావు, కలెక్టర్ అంకిత్, ఎస్పీ రోహిత్ రాజు శాలువా, పుష్పగుచ్ఛం అందజేసి గవర్నర్ స్వాగతం పలికారు.
భద్రగిరి మార్ట్ ను ప్రారంభించిన గవర్నర్
ఈ సందర్భంగా గవర్నర్ ఐటిడిఎ ఆధ్వర్యంలో భద్రాచలంలో – భద్రగిరి మార్ట్ ను గవర్నర్ శ్రీ శివ ప్రతాప్ శుక్లా ప్రారంభించారు.
మార్ట్ లో విక్రయానికి ఉంచిన గిరిజన ఉత్పత్తుల గురించి భద్రాచలం ఐటిడిఎ ప్రాజెక్ట్ అధికారి బి రాహుల్, సహాయ ప్రాజెక్ట్ అధికారి (జనరల్) డేవిడ్ లు గవర్నర్ కు వివరించారు. గిరిజన ఉత్పత్తులను పరిశీలించి, పలు ఉత్పత్తులను గవర్నర్ దంపతులు కొనుగోలు చేశారు.