April 15, 2026

భారత్ ఫ్యూచర్ సిటీలో అభివృద్ధి పనులపై సీఎం సమీక్ష

0
IMG-20260403-WA0013

రంగారెడ్డి జిల్లా ఏప్రిల్ 02: హైదరాబాద్:తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అభివృద్ధి చేస్తున్న భారత్ ఫ్యూచర్ సిటీ పరిధిలో కొనసాగుతున్న నిర్మాణ పనులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా పరిశీలించారు.ఈ సందర్భంగా ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ అథారిటీ ( ఎఫ్ సి డి ఎ) కార్యాలయ భవన నిర్మాణ పురోగతిని సమీక్షించిన సీఎం,ప్రాజెక్ట్ రూపకల్పనలపై అధికారులతో చర్చించి పలు కీలక సూచనలు చేశారు.నిర్మాణ పనులు నాణ్యతతో పాటు వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు.అలాగే యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ( వై ఐ ఎస్ యు)కి సంబంధించిన భవన సముదాయాలను సందర్శించిన ఆయన,పనుల పురోగతిపై సంతృప్తి వ్యక్తం చేస్తూనే మరింత వేగవంతం చేయాలని సూచించారు.సమీక్ష సందర్భంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ సుబ్బారావు తదితర అధికారులు సీఎం వెంట పాల్గొన్నారు.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed