లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని మర్యాదపూర్వకంగా కలిసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నూతన రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి మరియు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్
మార్చి 18 న్యూఢిల్లీ:తెలంగాణ రాష్ట్రం నుంచి ఇటీవల రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన శ్రీ వేం నరేందర్ రెడ్డి గారిని వెంట తీసుకుని, తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు, పీసీసీ అధ్యక్షుడు శ్రీ మహేష్ కుమార్ గౌడ్ గారితో కలిసి, లోక్ సభలో ప్రతిపక్ష నేత శ్రీ రాహుల్ గాంధీ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన సందర్భంలో పాల్గొనడం ఆనందంగా ఉంది.
ఈ సమావేశంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి చెందిన గౌరవ ఎంపీలు కూడా పాల్గొన్నారు. రాష్ట్రానికి,పార్టీకి సంబంధించిన పలు అంశాలపై చర్చలు సానుకూల వాతావరణంలో సాగాయి.