April 17, 2026

త్వరలో డిజిటల్ మీడియా పాలసీ: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

0
IMG-20260318-WA2543

మార్చి 17 హైదరాబాద్: వచ్చే రెండు, మూడు నెలల్లో డిజిటల్ మీడియా పాలసీని తీసుకు రాబోతున్నామని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, పౌర సంబంధాల శాఖా మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి గారు ప్రకటించారు. జర్నలిస్టుల సమస్యలపై శాసన మండలిలో మంగళవారం నాడు పలువరు సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి గారు సమాధానం ఇచ్చారు.

జర్నలిస్టు మిత్రులకు భద్రత కల్పించే విషయములో ఈ ప్రభుత్వం ఎలాంటి రాజీ పడబోదని స్పష్టం చేశారు. అక్రిడేషన్ కార్డుల జారీ విషయములో కొంత మంది లేనిపోని అపోహలను సృష్టిస్తున్నారు. అర్హులైన జర్నలిస్టులందరికి అక్రిడేషన్ కార్డులు జారీచేస్తాం. ఎలాంటి బేషజాలాలకు పోకుండా మొదట విడుదల చేసిన జీ.ఓ.పై అన్ని జర్నలిస్టుల సంఘాల అభిప్రాయాలను, సూచనలను తీసుకొని జీ.ఓ.లో మార్పులు చేర్పులు చేసాము. డెస్క్ జర్నలిస్టులు మరో జర్నలిస్టులనే తేడ మా ప్రభుత్వానికి లేదన్నారు. ఇండ్ల స్థలాల విషయములో కూడా సానుకూల నిర్ణయం తీసుకుంటామని ఇప్పటికి ఈ విషయములో గౌరవ ముఖ్య మంత్రి గారు స్పష్టత ఇచ్చారని, న్యాయస్థానం పరిధిలో ఇబ్బందులు లేకుండా ఇండ్ల స్థలాలు ఇవ్వడానికి కార్యాచరణ సిద్దం చేస్తున్నామని వెల్లడించారు.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed