April 17, 2026

ఈ సమావేశంలో యాంత్రికంగా కాదు… ఒక భావోద్వేగ బంధంతో పాల్గొన్నాను: సీఎం రేవంత్ రెడ్డి. శిక్షణ పూర్తి చేసుకున్న గ్రూప్-1, 2 అధికారులతో సీఎం రేవంత్ భేటీముఖ్యమంత్రిగా కాకుండా పెద్దన్నలా కలిశానన్న రేవంత్

0
IMG-20260227-WA1250

హైదరాబాద్ ఫిబ్రవరి 27:తెలంగాణ రాష్ట్ర తొలి గ్రూప్-1, గ్రూప్-2 అధికారులుగా ఎంపికై శిక్షణ పూర్తి చేసుకున్న యువ అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. హైదరాబాద్‌లోని ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీ ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. ఈ సమావేశానికి తాను ముఖ్యమంత్రిగా కాకుండా, ఆ యువ అధికారులకు ఒక పెద్దన్నగా వచ్చానని, యాంత్రికంగా కాకుండా పూర్తి భావోద్వేగ బంధంతో మాట్లాడానని ఆయన తెలిపారు. రాష్ట్ర పునర్నిర్మాణంలో భాగస్వాములు కాబోతున్న యువ సోదర, సోదరీమణులను కలవడం గొప్ప అనుభూతినిచ్చిందని పేర్కొన్నారు. ఈ నియామకాలకు సంబంధించి జరిగిన న్యాయపోరాటాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా గుర్తుచేశారు. కొందరు దుష్టశక్తులు ఈ యువత భవిష్యత్తును అంధకారంలోకి నెట్టేందుకు న్యాయవ్యవస్థ ద్వారా ప్రయత్నించాయని ఆరోపించారు. వారి టాలెంట్‌ను తక్కువ చేస్తూ, ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే కుట్రలు చేశారని విమర్శించారు. అయితే ప్రజా ప్రభుత్వం గట్టిగా నిలబడి, అదే న్యాయపోరాటంతో ఆ కుట్రలను ఛేదించిందని, అభ్యర్థుల జీవితాల్లో వెలుగులు నింపడం తనకు పూర్తి సంతృప్తినిచ్చిందని వివరించారు. ఈ విజయం ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమని పేర్కొన్నారు.అత్యంత పేదరికం నేపథ్యం నుంచి, తల్లిదండ్రుల చెమట చుక్కల స్ఫూర్తితో ఈ యువత ఉన్నత స్థాయికి ఎదగడం అద్వితీయమైన అనుభూతినిస్తోందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సొంత గడ్డకు సేవ చేసేందుకు వారు సిద్ధమవడం ఎంతో గర్వకారణమని చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగులపై సమాజంలో ఉన్న ‘గరం, నరం, బేషరం’ అనే నానుడిని ఈ యువ అధికారులు తమ పనితీరుతో తప్పు అని నిరూపించాలని ఆకాంక్షించారు. ఉద్యోగంలో చేరిన రోజున ఏ అంకితభావంతో ఉంటారో, ఉద్యోగ విరమణ చేసే రోజు వరకు అదే స్ఫూర్తితో పేదలకు సేవ చేయాలని ఆయన పిలుపునిచ్చారు. అధికారులుగా ప్రజలకు జవాబుదారీగా ఉండాలని, వారి సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషి చేయాలని సూచించారు.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed