ఇంటర్మీడియట్ పరీక్షా కేంద్రాల పరిశీలన – పటిష్ట భద్రతా చర్యలు
తిరుపతి ఫిబ్రవరి 25:తిరుపతి జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రశాంతంగా, ఎటువంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా సజావుగా నిర్వహించేందుకు సమగ్ర భద్రతా ఏర్పాట్లు చేపట్టడం జరిగింది.ఈ నేపథ్యంలో జిల్లా ఎస్పీ శ్రీ ఎల్ సుబ్బరాయుడు, ఐపీఎస్., గారు ఈరోజు తిరుపతిలో జరుగుతున్న పలు ఇంటర్మీడియట్ పరీక్షా కేంద్రాలను స్వయంగా సందర్శించి, అక్కడి భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. విధుల్లో ఉన్న పోలీస్ అధికారులు, సిబ్బందికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసి, పలు కీలక సూచనలు చేశారు.జిల్లా ఎస్పీ ముఖ్య ఆదేశాలు: పరీక్షా కేంద్రాల పరిసర ప్రాంతాల్లో అనుమానాస్పద వ్యక్తుల సంచారంపై కఠిన నిఘా ఏర్పాటు చేయాలి. పరీక్ష సమయాల్లో ట్రాఫిక్ అంతరాయం కలగకుండా ప్రత్యేక ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టాలి. పరీక్షా కేంద్రాల వద్ద గుంపులుగా నిలబడకుండా తగిన నియంత్రణ చర్యలు తీసుకోవాలి.విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయడానికి అవసరమైన భద్రతా వాతావరణం కల్పించాలి.పరీక్షా కేంద్రాల సమీపంలో 100 మీటర్ల పరిధిలో అమలులో ఉన్న నిషేధాజ్ఞలను కచ్చిత పాటించాలని చెప్పారు.