నాగోల్‌లో హిందూ యువకుడిపై దాడి ఘటన – నిందితులపై అత్యాయత్నం కేసు నమోదు చేయాలి:అందెల శ్రీరాములు
ఫిబ్రవరి 25 నాగోల్ ఎల్ బి నగర్: పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల జరిగిన దాడి ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.మొబైల్ ఫోన్ రిపేర్ కోసం స్థానిక మొబైల్ షాప్‌కు వెళ్లిన హిందూ యువకుడు సాయి కిషోర్ గౌడ్ వద్ద ముందుగా చెప్పిన మొత్తానికి భిన్నంగా అధిక డబ్బులు డిమాండ్ చేయబడినట్లు సమాచారం.
“ముందు తక్కువ చెప్పి ఇప్పుడు ఎక్కువ ఎందుకు అడుగుతున్నారు?” అని ప్రశ్నించినందుకు షాప్ యాజమాన్యం అతనితో దురుసుగా ప్రవర్తించినట్లు తెలుస్తోంది. అనంతరం షాప్ యజమాని బయట నుండి కొంతమందిని పిలిపించి కట్టెలు, ఇనుప రాడ్లతో దాడి చేయించినట్లు ఆరోపణలు ఉన్నాయి.
ఈ దాడిలో సాయి కిషోర్ గౌడ్ కాలు విరిగినట్లు సమాచారం. ప్రస్తుతం అతను చికిత్స పొందుతున్నాడు.
ఈ ఘటనపై స్పందించిన అందెల శ్రీరాములు గారు బాధితుడిని పరామర్శించి, దాడికి పాల్పడిన వారిపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడారు.
అందెల శ్రీరాములు గారు మాట్లాడుతూ, రాష్ట్రంలో ఇటువంటి ఘటనలు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. నిందితులపై వెంటనే అత్యాయత్నం (Attempt to Murder) కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని ఆయన ప్రధానంగా డిమాండ్ చేశారు.
డిమాండ్లు:
దాడి చేసిన నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలి.
అత్యాయత్నం కేసు నమోదు చేయాలి.
బాధితుడికి పూర్తి వైద్య సహాయం మరియు నష్టపరిహారం అందించాలి.
కాంప్రమైజ్ ఒత్తిడి తెచ్చిన అధికారులపై విచారణ జరపాలి.
నాగోల్ ఘటనపై తక్షణ చర్యలు తీసుకోకపోతే ప్రజాస్వామ్యబద్ధంగా ఆందోళనలు చేపడతామని ఆయన హెచ్చరించారు.