మా అబ్బాయి పెళ్లికి రండి. సోనియా రాహుల్ గాంధీలకు డిప్యూటీ సీఎం భట్టి ఆహ్వానం
ఫిబ్రవరి 25 న్యూ డిల్లీ: మార్చి 5వ తేదీన జరిగే తమ కుమారుడు సూర్య విక్రమాదిత్య వివాహానికి రావలసిందిగా కాంగ్రెస్ పార్టీ అగ్ర నేతలు సోనియా, రాహుల్ గాంధీలను తెలంగాణా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆహ్వానించారు. ఈమేరకు కుటుంబ సభ్యులతో కలిసి భట్టి సోనియా, రాహుల్ గాంధీలకు వివాహ శుభలేఖను అందించారు