లాక్‌డౌన్ వార్తలపై క్లారిటీ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం
న్యూ డిల్లీ 28:చమురు సంక్షోభం కారణంగా దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్ విధించబోతుందన్న వార్తలు సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం అవుతున్న నేపథ్యంలో కేంద్ర పెట్రోలియం మరియు సహజ వాయువు శాఖ మంత్రి హర్‌దీప్ సింగ్ పురీ స్పందించారు. ఈ ప్రచారాల్లో ఎలాంటి నిజం లేదని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వానికి లాక్‌డౌన్ విధించేలా ఎలాంటి ప్రతిపాదన లేదని ఆయన తెలిపారు. ప్రజలు నిర్ధారణ లేని సమాచారాన్ని నమ్మి ఆందోళన చెందవద్దని సూచించారు. దేశంలో చమురు సరఫరా మరియు పరిస్థితులపై ప్రభుత్వం సమగ్రంగా నిఘా ఉంచుతోందని ఆయన పేర్కొన్నారు.