దోమల నివారణకు శాశ్వత పరిష్కారం.చెరువులో పేరుకుపోయిన గుర్రపు డెక్క ఆకులు తొలగించాలి అధికారులకు ఆదేశాలు — ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి
ఎల్బీనగర్,నాగోల్, మార్చ్ 13:ఎల్బీనగర్ నియోజకవర్గం పరిధిలో నాగోల్ చెరువు నందు పేరుకుపోయిన గుఱ్ఱపుడెక్క ఆకును ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి. పరిశీలించారు.ఈ సందర్భంగా
వారు మాట్లాడుతూ. కోనేరు వద్ద వాకింగ్ రావాలంటే దోమల వల్ల మాకు ఎక్కడ విషరోగాలు వస్తాయో అని బయపడుతున్నామని అన్నారు.ఇట్టి దోమల ప్రభావం వల్ల చాలామంది ఉదయం మరియు సాయంత్రం పూట వాకింగ్ రావడానికి జంకుతున్నారు అని అన్నారు. గత
భారస ప్రభుత్వంలో ప్రజ సమస్యల మీద ఎంతో చిత్తశుద్ధితో ముందుచూపుతో ఆలోచించి నియోజకవర్గ పరిధిలోని చెరువుల్లో గుఱ్ఱపుడెక్క ఆకు పేరుకొనిపోకుండా కాలనీవాసుల సౌలభ్యం కోసం దోమల నివారణకు డ్రోన్స్ సహాయంతో ప్రయోగాత్మకంగా పరీక్షలు నిర్వహించి సఫలీకృతం కావడం జరిగింది.అలాగే చెరువుల్లో దోమల వల్ల ఉత్పన్నం అయ్యే లార్వాను అరికట్టడానికి వేలాది గంబూజియా జాతికి చెందిన చేప పిల్లలను చెరువులోకి వదలడం వల్ల అవి లార్వాను మింగేయడం జరిగింది.తద్వారా దోమల వ్యాప్తి అరికట్టడం జరిగింది.అలాగే డ్రోన్ పరిజ్ఞానం ఉపయోగించి చెరువు మధ్యలోకి వెళ్లడం సాధ్యం కాని చోట్ల కూడా దోమల నివారణకు మందులు చల్లడం జరిగింది అని గుర్తు చేశారు.కానీ ప్రస్తుతం ఇట్టి ప్రభుత్వం ప్రజా ఆరోగ్యాల మీద దృష్టి పెట్టకుండా చెరువుల్లో పెరుకుపోతున్న గుఱ్ఱపుడెక్క ఆకును తొలగించకుండా నిమ్మకు నీరెత్తినట్లు చోద్యం చూస్తుంది.ప్రజలు విష జ్వరాలతో బాధపడుతున్న హులుకులేదు పలుకులేదని అన్నారు.ప్రస్తుతం ఉదయం మరియు సాయంత్రం పూట వాకింగ్ కోసం రావాలంటే దోమల దండయాత్ర వల్ల ఎక్కడ మలేరియా,డెంగీ జ్వరాలు వస్తాయో అని ప్రజలు భయపడుతున్నారు అని అన్నారు.కొందరు కాంగ్రెసు నాయకులు చిల్లర రాజకీయాలు చేస్తూ తమ పబ్బం గడుపుతున్నారు అని విమర్శించారు.ఇట్టి ప్రభుత్వం ఫోర్త్ సిటీ అని గొప్పలు చెప్పుకుంటు ప్రస్తుతం ఉన్న సీటీని కాపాడుకోలేక తంటాలు పడుతుంది అని అన్నారు. జంటనగారాల అభివృద్ధి గాలికి వదిలారని అన్నారు. సాయంత్రం పూట వాకింగ్ పోతే పక్కవారితో మాట్లాడితే వారి నోట్లోకి దోమలు దూరుతున్నాయి అని అన్నారు.కావున ఇప్పటిఅయిన ఇట్టి ప్రభుత్వం ప్రజా ఆరోగ్య సమస్యల మీద దృష్టి సారించాలని కోరుతున్నాము.అలాగే ప్రస్తుతం నియోజకవర్గ పరిధిలో చెరువుల్లో పేరుకుపోయిన గుఱ్ఱపుడెక్క ఆకును రెండు,మూడు రోజుల్లో తొలగించి అనంతరం చుట్టుపక్కల కాలనీల దోమల స్ప్రే చేయించడం జరుగుతుంది.అనంతరం నాగోల్ డివిజన్ భారస పార్టీ యువ నాయకులు పీ.ఏం.ఆర్.రాజు(పోచంపల్లి రాజేందర్ రెడ్డి) తన స్వంత నిధులతో రెండు ఫాగింగ్ మిషిన్లు కొనుగోలు చేయడం జరిగింది.
ముందుగా వారిని అభినందించారు.అనంతరం సుధీర్ రెడ్డి మాట్లాడుతూ దోమలపై దండయాత్ర చేపట్టాం.ప్రజలు చైతన్యవంతులై సహకరించాలి అని సుదీర్ రెడ్డి పిలుపునిచ్చారు.గత భారస హయాంలో మేము తమవంతుగా కొన్ని దోమల పాగింగ్ యంత్రాలు కొనుగోలు చేయడం జరిగిందని గుర్తు చేశారు.దోమల కారణంగా ప్రాణసంకటమైన జ్వరాలు వస్తాయి.వైద్యం కోసం లక్షల రూపాయల్లో ఖర్చవుతుంది.
దోమలను నివారించగలిగితే ఇంటిల్లిపాది ఆనందంగా ఉంటారు.అందుకే దోమలను నివారించేందుకు అన్ని వర్గాలు ముందుకురావాలి అని కోరారు.కావున ప్రతి ఒక్కరు తమ,తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవలని కోరారు.సీజనల్ వ్యాధులు డెంగ్యూ,మలేరియా ఇతర లక్షణాలు కూడా జ్వరం,దగ్గు,జలుబు లాగే వస్తాయి.అయితే అప్పుడు ప్రజలు ఏ లక్షణాలతో ఇబ్బందులు పడుతున్నారు అని తెలుసుకోవడం కొంచెం ఇబ్బందిగా ఆవుతున్నా క్రమంలో దానిని దృష్టిలో పెట్టుకుని ముందుజాగ్రత్త చర్యగా దోమల నివారణకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.కొందరు కాంగ్రెసు నాయకులు చిల్లర రాజకీయాలు చేస్తూ తమ పబ్బం గడుపుతున్నారు అని విమర్శించారు.ఇట్టి ప్రభుత్వం ఫోర్త్ సిటీ అని గొప్పలు చెప్పుకుంటు ప్రస్తుతం ఉన్న సీటీని కాపాడుకోలేక తంటాలు పడుతుంది అని అన్నారు.జంటనగారాల అభివృద్ధి గాలికి వదిలారని అన్నారు.సాయంత్రం పూట వాకింగ్ పోతే పక్కవారితో మాట్లాడితే వారి నోట్లోకి దోమలు దూరుతున్నాయి అని అన్నారు.ఎల్.బి.నగర్ నియోజకవర్గ పరిధిలోని ప్రజలు కూడా తమ సామాజిక బాధ్యతగా ఇంటి పరిసరాల్లో దోమలు నిల్వ లేకుండా చూసుకోవాలి అని కోరారు.ముఖ్యంగా పులా కుండీల్లో,పాత టైర్లు,ఇతర వస్తువుల్లో నీరు నిలువవుండకుండా చూసుకోవాలి అని కోరారు.ఈ విధంగా ప్రతి ఒక్కరూ ఆచరిస్తే దోమలపై యుద్ధం సాధించినట్టు అని తెలిపారు.అనంతరం నాగోల్ చెరువు నందు ఉన్న గుఱ్ఱపుడెక్క ఆకును తొలగింపు కార్యక్రమంలో సుధీర్ రెడ్డి పాల్గొని పనులు వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు.ఇట్టి కార్యక్రమంలో సీనియర్ భారస నాయకులు ఆనంతుల రాజిరెడ్డి,మాజీ కార్పొరేటర్ చెరుకు సంగీత ప్రశాంత్ గౌడ్,డివిజన్ భారస అధ్యక్షులు తూర్పాటి చిరంజీవి,సతీశ్ యాదవ్,సీతరాములు,చిత్రాల జగదీష్,శ్రీనివాస్ రెడ్డి,భాస్కర్ యాదవ్,
వినోద్,విజయ్ సింహరెడ్డి,
నువ్వుల బండ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు రాగిరి మురళీమోహన్ గౌడ్, రాజేష్ గౌడ్, రవి గౌడ్, పద్మారావు,
మరియు సీనియర్ ఎంటమాలజిస్ట్ మాధవరెడ్డి,సందీప్,జనార్ధన్ మరియు పలువురు నాయకులు,అధికారులు పాల్గొన్నారు.