April 17, 2026

తెలంగాణకు ఆర్ధిక మూలాలు పెంచేలా పశుసంవర్ధకశాఖను అభివృద్ధి పరచాలి-మంత్రి వాకిటి శ్రీహరి

0
IMG-20260225-WA3723

ఫిబ్రవరి 25 హైదరాబాద్:తేదీ:
పాడి పరిశ్రమ పరిపూర్ణంగా ముందుకు సాగితేనే తెలంగాణ అభివృద్ధి సాధ్యం-మంత్రి వాకిటి శ్రీహరి. బడ్జెట్‌ లో అధిక నిధులు కేటాయించేలా నివేదికలు తయారు చేయండి-మంత్రి వాకిటి శ్రీహరి. ఆర్ధికంగా ఎదిగేలా ప్రభుత్వ పథకాలను రూపొందించండి-మంత్రి వాకిటి శ్రీహరిపశుసంవర్ధక శాఖకు సంబంధించి హర్యానా, తమిళనాడు, గుజరాత్‌ రాష్ట్రాల మోడల్‌ను ఆదర్శంగా తీసుకోండి-మంత్రి వాకిటి శ్రీహరి.పశుసంవర్ధక, పాడి పరిశ్రమలో ఏం చేస్తే సక్సెస్‌ అవుతామో అధ్యయనం చేయాలి-మంత్రి వాకిటి శ్రీహరి

ఆరోగ్యకరమైన తెలంగాణను నిర్మిస్తేనే భవిష్యత్‌ బాగుంటుంది-మంత్రి వాకిటి శ్రీహరి.అందుకోసం స్వచ్ఛమైన పాలు, బలమైన పోషకాలు ఉన్న చికెన్, మటన్, చేపల ఉత్పత్తి చేయాలి-మంత్రి వాకిటి శ్రీహరిఉన్నతాధికారులు, అధికారులు సమన్వయం చేసుకుంటూ బాధ్యతతో పనిచేస్తే మంచి ఫలితాలు వస్తాయి-మంత్రి వాకిటి శ్రీహరి.ఆర్ధిక స్వావలంబన లభించే పథకాలను రూపొందించి అమలుచేద్దాం-మంత్రి వాకిటి శ్రీహరి.

తెలంగాణకు ఆర్ధిక మూలాలు పెంచేలా పశుసంవర్ధకశాఖను అభివృద్ధి పరచాలని రాష్ట్ర పశుసంవర్ధక, పాడి పారిశ్రామికాభివృద్ధి, మత్స్య, యువజన సర్వీసులు & క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అధికారులకు దిశానిర్ధేశం చేశారు. 2026-2027 ఏడాదికిగాను పశుసంవర్ధక, పాడి పారిశ్రామికాభివృద్ధి బడ్జెట్‌ ప్రతిపాదనలపై సచివాలయంలో మంత్రి సమీక్ష నిర్వహించారు. కొత్త ఆలోచనలతోనే పశుసంవర్ధక శాఖలో మార్పులు తీసుకురాగలమని మంత్రి వాకిటి శ్రీహరి ఆశాభావం వ్యక్తం చేశారు. పాడి పరిశ్రమ పరిపూర్ణంగా ముందుకు సాగితేనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమని వివరించారు. బడ్జెట్‌లో నిధులు ఎన్ని కేటాయించారనేది కాకుండా ఎంతమేరకు ఖర్చు చేశామనే ఆలోచన చేసుకోవాలని మంత్రి వాకిటి శ్రీహరి సూచించారు. బడ్జెట్‌ లో అధిక నిధులు కేటాయించేలా నివేదికలు తయారు చేయాలని అధికారులను మంత్రి వాకిటి శ్రీహరి ఆదేశించారు. ఆర్ధికంగా ఎదిగేలా ప్రభుత్వ పథకాలను రూపొందించాలని మంత్రి సూచించారు.

పశుసంవర్ధక శాఖకు సంబంధించి హర్యానా, తమిళనాడు, గుజరాత్‌ రాష్ట్రాల మోడల్‌ను ఆదర్శంగా తీసుకొని రాష్ట్రంలో పథకాలను డిజైన్‌ చేయాలని మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. పశుసంవర్ధక, పాడి పరిశ్రమలో ఏం చేస్తే సక్సెస్‌ అవుతామో అధ్యయనం చేయాల్సిన అవసరముందన్నారు. ఆరోగ్యకరమైన తెలంగాణను నిర్మిస్తేనే భవిష్యత్‌ బాగుంటుందని మంత్రి వాకిటి శ్రీహరి అభిప్రాయపడ్డారు. అందుకోసం స్వచ్ఛమైన పాలు, బలమైన పోషకాలు ఉన్న చికెన్, మటన్, చేపల ఉత్పత్తి రాష్ట్రంలో జరుగాలని మంత్రి శ్రీహరి అన్నారు. ఉన్నతాధికారులు, అధికారులు సమన్వయం చేసుకుంటూ బాధ్యతతో పనిచేస్తే మంచి ఫలితాలు వస్తాయని మంత్రి వాకిటి స్పష్టం చేశారు.

పాడి రంగానికి సంబంధించి అన్ని అంశాలు బడ్జెట్‌లో పొందుపరచాలని, పాల ఉత్పత్తి, అందుకావాల్సిన మౌలిక సదుపాయాలు, ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని మంత్రి శ్రీహరి అన్నారు. పాడి పరిశ్రమ బలోపేతం, సమన్వయం కోసం ఐఏఎస్‌ స్థాయి అధికారిని నియమించుకోవాలని, దానివల్ల పాల ఉత్పత్తిని పెంచుకోవొచ్చని మంత్రి వాకిటి శ్రీహరి ఆశాభావం వ్యక్తం చేశారు. వెటర్నరీ సంస్థల్లో మౌలిక సదుపాయాలు, ఉద్యోగుల సంక్షేమం వంటి అంశాలకు కూడా బడ్జెట్‌లో ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. షెడ్యూల్ ప్రకారం పశువులకు టీకాలు, ఔషధాల సరఫరా జరిగేలా, దానికి బడ్జెట్‌లో కేటాయింపులు ఉండాలని అధికారులకు మంత్రి వివరించారు. గతంలో లాగా కాకుండా పశుసంవర్ధక శాఖను బలోపేతం చేయాలని మంత్రి అధికారులకు వివరించారు. ఈసమీక్ష సమావేశంలో రాష్ట్ర డెయిరీ డెవలప్‌మెంట్ చైర్మన్‌ గుత్తా అమిత్‌ రెడ్డి, పశుసంవర్ధక, పాడిపరిశ్రమ, మత్స్య శాఖ సెక్రటరీ సురేంద్ర మోహన్ FAC, డైరెక్టర్ గోపీ, డెయిరీ డెవలంప్‌మెంట్ ఎండీ చంద్రశేఖర్ రెడ్డి, పివి నర్సింహరావు వెటర్నరీ యూనివర్శిటీ వైస్‌ ఛాన్సలర్ డా.జ్ఞానప్రకాశ్, ఉన్నతాధికారులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed