April 17, 2026

ఇన్‌స్టాగ్రామ్‌ను షేక్ చేసిన నరేంద్ర మోదీ. అరుదైన రికార్డ్ సాధించారు ప్రధాని మోదీ

0
IMG-20260226-WA0808

ఫిబ్రవరి 26 న్యూఢిల్లీ: సోషల్ మీడియాలో భారత ప్రధాని నరేంద్ర మోదీ అరుదైన రికార్డు సాధించారు. ఇన్‌స్టాగ్రామ్‌లో 100 మిలియన్ల (10 కోట్ల) ఫాలోవర్లను దాటిన ప్రపంచ నాయకుల్లో ప్రధాని మోదీ ఒకరిగా నిలిచారు. డిజిటల్ మాధ్యమాలను సమర్థవంతంగా వినియోగిస్తూ, దేశాభివృద్ధి, ప్రభుత్వ పథకాలు, ప్రజలతో ప్రత్యక్ష సంభాషణ వంటి అంశాలను సోషల్ మీడియా వేదికగా ముందుకు తీసుకెళ్తూ ప్రధాని మోదీ విశేష ప్రజాదరణ పొందుతున్నారు. ఇన్‌స్టాగ్రామ్ ద్వారా దేశ ప్రజలతోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులతోనూ అనుసంధానం కొనసాగిస్తూ, భారత నాయకత్వానికి గ్లోబల్ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంటున్నారు. ఈ 100 మిలియన్ల ఫాలోవర్ల మైలురాయి, డిజిటల్ యుగంలో భారత రాజకీయాలకు మరో చారిత్రాత్మక ఘట్టంగా నిలిచింది.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed