April 18, 2026

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సమాజ అభివృద్ధిలో మహిళల పాత్రను గుర్తు చేసుకుంటూ ప్రత్యేక వేడుకలను నిర్వహిస్తున్నట్లు నవ యువ యూత్ క్లబ్ అధ్యక్షులు ఏర్వ కుమారస్వామి తెలిపారు

0
IMG-20260306-WA0935

మార్చి 6 రాజేంద్రనగర్: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సమాజ అభివృద్ధిలో మహిళల పాత్రను గుర్తు చేసుకుంటూ ప్రత్యేక వేడుకలను నిర్వహిస్తున్నట్లు నవ యువ యూత్ క్లబ్ అధ్యక్షులు ఏర్వ కుమారస్వామి తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. మార్చి 8వ తేదీ ఆదివారం ఉదయం 9 గంటలకు రాజేంద్రనగర్ నియోజకవర్గం, మైలార్‌దేవ్‌పల్లి డివిజన్ పరిధిలోని భావన ఋషి కాలనీలో ఉన్న శ్రీ మార్కండేయ ట్రస్ట్ భవనంలో ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. నవ యువ యూత్ క్లబ్ మరియు మానవ సేవే మాధవ సేవా సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో, రంగారెడ్డి జిల్లా పద్మశాలి యువజన సంఘం అధ్యక్షులు కొంపల్లి జగదీష్ సహకారంతో ఈ వేదికను సిద్ధం చేస్తున్నట్లు వివరించారు. ఈ సందర్భంగా కుమారస్వామి మాట్లాడుతూ.. మహిళలు కేవలం కుటుంబాన్ని నడిపించే శక్తి మాత్రమే కాకుండా విద్య, వైద్యం, రాజకీయాలు, సామాజిక సేవ వంటి రంగాల్లో విశేష కృషి చేస్తూ దేశాభివృద్ధికి దోహదపడుతున్నారని కొనియాడారు.
ఈ వేడుకల్లో భాగంగా సేవా భారతి విద్యార్థులచే ప్రదర్శించబడే సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. మహిళల ప్రతిభను ప్రతిబింబించేలా పలు ప్రదర్శనలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి స్థానిక మహిళలు, హాజరై జయప్రదం చేయాలని ఆయన కోరారు. వేదికను అందించిన శ్రీ మార్కండేయ ట్రస్ట్ ప్రతినిధులకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed