April 17, 2026

అర్హులైన ప్రతి లబ్ధిదారుకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు చేరేలా అధికారులు కృషి చేయాలి : మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి

0
IMG-20260306-WA3043

మార్చి 6 మహబూబాబాద్:రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అర్హులైన ప్రతి లబ్ధిదారుకు చేరేలా అధికారులు కృషి చేయాలని రాష్ట్ర రెవెన్యూ, సమాచార, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి గారు తెలిపారు.శుక్రవారం ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంపై మహబూబాబాద్ ఐడీఓసి కార్యాలయంలో ఉమ్మడి వరంగల్ జిల్లాల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ గారు, మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యులు పోరిక బలరాం నాయక్ గారు, ప్రభుత్వ విప్ రామచంద్ర నాయక్ గారు, ఎమ్మిల్సి రవీందర్ రావు గారు, శాసన సభ్యులు మురళి నాయక్ గారు, దొంతి మాధవరెడ్డి గారు, రాజేందర్ రెడ్డి గారు, నాగరాజు గారు, రేవూరి ప్రకాష్ రెడ్డి గారు, వరంగల్ మేయర్ గుండు సుధారాణి గారు, కూడా చైర్మన్ ఇనుగల వెంకట్రామిరెడ్డి గారు, ఉమ్మడి జిల్లాల కలెక్టర్లు మరియు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి గారు మాట్లాడుతూ.. ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత చేరువ చేయాలనే లక్ష్యంతో ఈ నెల 6వ తేదీ నుండి జూన్ 12వ తేదీ వరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా “ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక” కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో గుర్తించిన సమస్యలను పరిష్కరించేందుకు అధికారులు సమన్వయంతో చర్యలు తీసుకోవాలని సూచించారు.

విద్యా మరియు వైద్య రంగాలకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి గారు తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యుల కొరతను తీర్చాలని, అవసరమైన సిబ్బందిని నియమించుకోవాలని చెప్పారు. ముఖ్యంగా మారుమూల గ్రామాల్లో కూడా వైద్య సేవలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని, ఎలాంటి కొరత ఉండకుండా చూడాలని సూచించారు. ఉపయోగంలో లేని వైద్య పరికరాలను తొలగించి, అవసరమైన పరికరాలకు తగిన సిబ్బందిని నియమించి వాటిని సమర్థంగా వినియోగంలోకి తేవాలని పేర్కొన్నారు. పాఠశాలల వాహనాలు ఫిట్ నెస్ లేకపోతే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అధికారులు కఠినంగా వ్యవహరించాలని సూచించారు. జిపిఆర్ఎస్ ద్వారా పాఠశాల వాహనాలు పర్యవేక్షణ చేయాలని తెలిపారు.

స్లమ్ ఏరియాల్లో నివసిస్తున్న ప్రజలకు ఇందిరమ్మ ఇండ్లు నిర్మించాలని, ఉందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో వేగం పెంచాలి, ఎక్కడైనా నిధులు మంజూరు సమస్య ఉంటే నివేదికలు పంపాలని తెలిపారు. ప్రతి హస్టల్ పర్యవేక్షణకు ప్రత్యేక అధికారిని నియమించి తనిఖీలు చేయాలని, విద్యార్థులతో కలిసి భోజనాలు చేయాలని తెలిపారు. గ్రామ, మండల స్థాయిలో ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందిన లబ్ధిదారుల జాభితా తయారు చేయాలని తెలిపారు. మార్చి నెలాఖరు వరకు ఇందిరమ్మ ఇండ్లు పూర్తి అయ్యేలా చర్యలు తీసుకోవాలని, గ్రౌండ్ కాని ఇండ్లు లబ్ధిదారుల నుండి అంగీకారాన్ని తీసుకుని రద్దు చేయాలని తెలిపారు. అనర్హులకు ఇండ్లు ఇస్తే కలెక్టర్లు భాద్యులు అవుతారని తెలిపారు. అటవీ ప్రాంతాల్లో పాత ఇల్లు ఉన్న ప్రాంతాల్లో ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణం చెస్తే ఆటంకాలు కలిగించొద్దని అటవీ అధికారులను ఆదేశించారు.

వినియోగంలో లేని పాత భవనాలను తొలగించాలని, ముఖ్యంగా పాఠశాలలు తొలగించి నూతన భవనాలు నిర్మాణానికి ప్రతిపాదనలు పంపాలని తెలిపారు. వినియోగంలో ఉన్న భవనాలకు రంగులు వేయాలని
తెలిపారు. అర్హులైన మహిళలను మహిళ సంఘాలలో సభ్యులుగా చేర్చాలని తెలి పారు. మహిళల పథకాలకు సంబంధించి అన్ని పథకాలు ఈ 99 రోజుల్లో పూర్తి చేయాలని ఆదేశించారు.

ప్రతి జిల్లాలో ఒక్కో ఎకో పార్కులు ఏర్పాటు చేయాలని, స్థానిక ప్రజా ప్రతినిధులను సమన్వయం చేసుకుని ప్రతిపాదనలు ఇవ్వాలని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవానికి వచ్చిన మహిళకు హెచ్ ఐ వి పాజిటివ్ ఉంటే నెగిటివ్ అని తప్పుడు ధ్రువీకరణ ఇచ్చారని మహబూబాద్ శాసన సభ్యులు మురళి నాయక్ గారు చేసిన ఫిర్యాదుపై తక్షణమే విచారణ నిర్వహించి నివేదిక ఇవ్వాలని కలెక్టర్ కు సూచించారు. ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి సూపరిన్టెండెంట్ సమావేశానికి గైర్హాజరు కావడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఛార్జ్ మెమో జారీ చేయాలని మంత్రి పొంగులేటి గారు కలెక్టర్ కు సూచించారు.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed