April 17, 2026

బద్రుకా కళాశాల ఎన్ ఎస్ ఎస్ వాలంటీర్ల విజయ ప్రభంజనం

0
IMG-20260317-WA1590

హైదరాబాద్, మార్చి 17: దేశ గౌరవాన్ని కాపాడటంలో యువత ముందుండాలి. ‘రైజింగ్ తెలంగాణ’ నిర్మాణానికి తోడ్పడుతూ, ‘విక్సిత్ భారత్ – 2047’ లక్ష్యాన్ని సాధించడానికి కృషి చేయాలి” అని ఉస్మానియా విశ్వవిద్యాలయం వైస్ -చాన్సలర్ మరియు ఎన్‌ఎస్‌ఎస్ చైర్మన్ శ్రీ ప్రొఫెసర్ కుమార్ మోలుగరం పేర్కొన్నారు.
మంగళవారం ఆయన సాన్నిధ్యంలో గ్రూప్ ఫోటో కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయం పరిధిలోని ఎన్‌ఎస్‌ఎస్ వాలంటీర్లు ఉత్సాహంగా పాల్గొన్నారు. దేశంలోని వివిధ రాష్ట్రాలలో నిర్వహించిన నేషనల్ ఇంటిగ్రేషన్ ప్రోగ్రామ్ ఆఫీసర్లు మరియు కంటింజెంట్ నాయకులు వైస్ -చాన్సలర్‌ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ కార్యక్రమం ఉస్మానియా విశ్వవిద్యాలయం ఎన్‌ఎస్‌ఎస్ సెల్ ప్రోగ్రామ్ కో ఆర్డినేటర్ డా. చలమల్ల వెంకటేశ్వర్లు నాయకత్వంలో విజయవంతంగా నిర్వహించబడింది. ఈ సందర్భంగా వైస్ -చాన్సలర్ మాట్లాడుతూ యువత దేశ నిర్మాణంలో కీలక పాత్ర పోషించాల్సిన అవసరాన్ని వివరించారు. ఎన్‌ఎస్‌ఎస్ వాలంటీర్లు గ్రామీణ స్థాయిలో సామాజిక మార్పుకు దూతలుగా నిలవాలని, సమాజ సేవ, నాయకత్వ లక్షణాలు, క్రమశిక్షణను పెంపొందించుకోవాలని సూచించారు. సమగ్ర మరియు అభివృద్ధి చెందిన భారత నిర్మాణానికి తమ వంతు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
విద్యార్థులు తమ క్యాంప్ అనుభవాలను పంచుకొని, జాతీయ ఐక్యతపై తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. వారి పాల్గొనడాన్ని వైస్-చాన్సలర్ అభినందిస్తూ, ఈ తరహా క్యాంపులు దేశభక్తి, నాయకత్వ లక్షణాలు, సాహస స్పూర్తిని పెంపొందించడంలో ముఖ్యపాత్ర పోషిస్తాయని తెలిపారు. అలాగే దేశంలోని వివిధ సంస్కృతులు, సంప్రదాయాలపై అవగాహన పెంచుతాయని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా విద్యార్థులు వైస్-చాన్సలర్‌తో కలిసి గ్రూప్ ఫోటోలు దిగారు. భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనాలని ఆయన ప్రోత్సహిస్తూ తన శుభాకాంక్షలు తెలిపారు.
బద్రుకా కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ ఆర్ట్స్ నుండి విశేషమైన విజయాలు నమోదయ్యాయి. డా. కె. మమత, ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ మరియు యుబిఏ కోఆర్డినేటర్, 2025లో హైదరాబాద్‌లోని ఎంఎల్ఆర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో జరిగిన నేషనల్ ఇంటిగ్రేషన్ క్యాంప్ కు తెలంగాణ కంటింజెంట్ లీడర్‌గా ఎంపికయ్యారు.
గజవాడ సాయిచరణ్, 2025లో హేమచంద్రాచార్య నార్త్ గుజరాత్ యూనివర్సిటీలో జరిగిన వెస్ట్ జోన్ ఎన్‌ఎస్‌ఎస్ ప్రీ-రిపబ్లిక్ డే పరేడ్ క్యాంప్‌లో ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని ప్రతినిధ్యం వహించారు.
బల్లేపు భార్గవి, అస్సాంలోని గౌహతిలో ఉన్న కుమార భాస్కర్ వర్మ సంస్కృత మరియు ప్రాచీన అధ్యయన విశ్వవిద్యాలయంలో జరిగిన నేషనల్ ఇంటిగ్రేషన్ క్యాంప్ కు ఎంపికయ్యారు.
అద్దంకి సాయి శ్రీపాద్, హైదరాబాద్‌లోని దుండిగల్ ఎంఎల్ఆర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో నిర్వహించిన నేషనల్ ఇంటిగ్రేషన్ క్యాంప్ కు ఎంపికయ్యారు.

సెక్రటరీ శ్రీ శ్రీ కిషన్ బద్రుక, డైరెక్టర్ జనరల్ ప్రొ.అభిరామ కృష్ణ, ప్రిన్సిపాల్ మరియు ఎన్‌ఎస్‌ఎస్ చైర్మన్ డా. బి. మోహన్ కుమార్, వైస్ ప్రిన్సిపాల్స్ డా పి వెంకటయ్య, మితేష్ కడాకీయ ఈ అవకాశాన్ని సాధించిన విద్యార్థులు మరియు అధ్యాపకులను అభినందించారు.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed