పాశమైలారo అగ్ని ప్రమాద స్థలాన్ని సందర్శించారు ఏఐసీసీ తెలంగాణ ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్
జూలై 2:పాశమైలారం సిగాచీ పరిశ్రమలో జరిగిన ఘోర అగ్నిప్రమాద స్థలాన్ని ఏఐసీసీ తెలంగాణ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి బుధవారం సందర్శించారు. ఘటనకు సంబంధించిన వివరాలను మంత్రి దామోదర్ రాజనర్సింహను అడిగి తెలుసుకున్నారు. బాధితులకు తగిన న్యాయం కల్పించాల్సిందిగా నేతలు కోరారు. పాశమైలారం పరిశ్రమలో పేలుడు ప్రమాదంలో 40 మంది మృతి చెందినట్లు సిగాచీ పరిశ్రమ ప్రకటన విడుదల చేసింది. మరో 33 మంది గాయపడినట్లు తెలిపింది. మృతుల కుటుంబాలకు రూ. కోటి చొప్పున పరిహారం ఇస్తామని ప్రకటించింది. గాయపడిన వారికి పూర్తి వైద్యం అందిస్తామని, అన్నివిధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చింది. సిగాచీ తరఫున కంపెనీ సెక్రటరీ వివేక్ కుమార్ ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు.