జిల్లా సమగ్రాభివృద్ధికి అధికారులు సమన్వయంతో చర్యలు చేపట్టాలి,విద్యా, వైద్యానికి అత్యంత ప్రాధాన్యత.ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలి: వరంగల్ ఎంపీ కడియం కావ్య
హనుమకొండ మార్చి 7:హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లో జిల్లా అభివృద్ధి సమన్వయ పర్యవేక్షణ కమిటీ(దిశా) సమావేశంఎంపీ కడియం కావ్య అధ్యక్షతన నిర్వహించిన దిశా కమిటీ సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర శాసనమండలి డిప్యూటీ చైర్మన్ డాక్టర్ బండా ప్రకాష్, ఎమ్మెల్సీ బస్వరాజ్ సారయ్య, ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, కె ఆర్ నాగరాజు, గండ్ర సత్యనారాయణ రావు, మేయర్ సుధారాణి, జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్, తదితరులుశనివారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య అధ్యక్షతన జిల్లా అభివృద్ధి సమన్వయ పర్యవేక్షణ కమిటీ( దిశా) సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సమావేశంలో గత దిశా సమావేశంలో నిర్ణయించిన అంశాలపై తీసుకున్న చర్యలు, మహిళా శిశు సంక్షేమ, జిల్లా వైద్య ఆరోగ్య, విద్యా, వ్యవసాయ గ్రామీణ నీటి సరఫరా, పారిశుద్ధ్య, నీటిపారుదల, గనులు, భూగర్భ జల, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్, జాతీయ రహదారులు, ఆర్ అండ్ బి, జిల్లా ముఖ్య ప్రణాళిక తదితర శాఖలకు సంబంధించిన వివిధ అభివృద్ధి పనులు, వాటి పురోగతి, చేపట్టాల్సిన చర్యలపై ఎంపీ డాక్టర్ కడియం కావ్య, ఎమ్మెల్యేలు సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించారు.
ఈ సమావేశంలో దిశా కమిటీ ఛైర్ పర్సన్, వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య మాట్లాడుతూ
ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలను పకడ్బందీగా అమలు చేస్తూ జిల్లాను అభివృద్ధిపథంలో అగ్రగామిగా నిలిపేందుకు అధికారులు సమన్వయంతో కృషి చేయాలని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య అన్నారు. ప్రభుత్వం విద్యా వైద్యానికి అత్యంత ప్రాధాన్యతనిస్తోందన్నారు. పాఠశాలల్లో డ్రాపౌట్స్ పై దృష్టి సారించాలని అదేవిధంగా పాఠశాలల్లో విద్యార్థుల ప్రవేశాల సంఖ్యను గణనీయంగా పెంచాలన్నారు. బాల్యవివాహాల నిర్మూలనకు తగిన చర్యలు చేపట్టాలన్నారు. వేసవిలో తాగునీటి సమస్యలు తలెత్తకుండా ఎప్పటికప్పుడు చర్యలు చేపట్టాలన్నారు. హనుమకొండ జిల్లా పదో తరగతి ఫలితాల్లో అగ్రస్థానంలో ఉండాలన్నారు. పదో తరగతి విద్యార్థులకు పరీక్షలు పూర్తయ్యేంతవరకు స్నాక్స్ అందజేయాలన్నారు. గర్ల్స్ హాస్టల్ ను తెచ్చుకునే అవకాశం ఉంటుందన్నారు. పీఎం సూర్య ఘర్ సోలార్ ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టాలని, వాటిని ఏర్పాటు చేయడం ద్వారా నిరంతరాయంగా సోలార్ విద్యుత్ నఅందజేయవచ్చన్నారుప్రభత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు అధికారులుప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో బాలికలకు టాయిలెట్స్ ఉండాలనేది ఎంతో ముఖ్యమనిసుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఇచ్చిందని పేర్కొన్నారు. 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో వైద్య ఆరోగ్య సంబంధించిన అంశాలపై ప్రత్యేక దృష్టి సాధించాలన్నారు. జిల్లాలో ఎయిడ్స్ నియంత్రణకుపటిష చర్యలు తీసుకోవాలని అన్నారు. కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన జి- రామ్ జీ పథకం గైడ్లైన్స్ గురించి తెలియజేయాలన్నారు. జిల్లాలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాలకు నివారణకు చర్యలు చేపట్టాలని నేషనల్ హైవే, ఆర్ అండ్ బి అధికారులను ఆదేశించారు. రోడ్లపై చాలా చోట్ల విద్యుత్ దీపాలు లేవని, వెంటనే అమర్చాలని అన్నారు. వచ్చే దిశా సమావేశానికి అధికారులు సమన్వయంతో అభివృద్ధి పనులపై సమగ్ర వివరాలతో హాజరుకావాలని అన్నారు.
సమావేశం అనంతరం వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో రూపొందించిన బాలికలకు వేసే హెచ్ పి వి వ్యాక్సినేషన్ కార్యక్రమం, అదేవిధంగా టీజీ రెడ్కో ఆధ్వర్యంలో తయారుచేసిన ప్రధానమంత్రి సూర్య ఘర్ ముఫ్త్ బిజిలి యోజన పథకానికి సంబంధించిన పోస్టర్లను ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యేలు, కలెక్టర్, తదితరులు ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో కుడా ఛైర్మన్ ఇనగాల వెంకట్రాంరెడ్డి, జిల్లా అదనపు కలెక్టర్ రవి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.