ఘనంగా 79 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.దేశ హితం కోసం అందరూ ఐక్యమత్యంగా ఉండాలి – శ్రీరాములు అందెల
ఆగస్టు 15 మహేశ్వరం:79వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు మహేశ్వరం నియోజకవర్గం బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ లోని నియోజకవర్గ బిజెపి కార్యాలయంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా రంగారెడ్డి జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల కన్వీనర్, మహేశ్వరం నియోజకవర్గ బిజెపి ఇన్చార్జ్ అందెల శ్రీరాములు గారు హాజరై భారతమాత చిత్రపటానికి పూలమాలలు వేసి జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం శ్రీరాములు గారు మాట్లాడుతూ ప్రజలందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. దేశ హితం కోసం ప్రజలందరూ కూడా ఐక్యమత్యంగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ బిజెపి అధ్యక్షులు రాళ్ల గూడెం రామకృష్ణారెడ్డి, మాజీ అధ్యక్షులు చెరుకుపల్లి వెంకట్ రెడ్డి, మాజీ ఫ్లోర్ లీడర్ తోట శ్రీధర్ రెడ్డి, మాజీ కార్పొరేటర్లు నిమ్మల సునీత శ్రీకాంత్ గౌడ్, గూడెపు ఇంద్రసేన, సహకార బ్యాంకు డైరెక్టర్లు తోట ప్రతాప్ రెడ్డి, తిరుపతి గిరి, తుక్కుగూడ మున్సిపాలిటీ మాజీ అధ్యక్షులు రచ్చ లక్ష్మణ్, కార్పొరేషన్ ప్రధాన కార్యదర్శి భాస్కర్ రెడ్డి, రావుల మల్లేష్, కార్యదర్శి ప్రవీణ్ గౌడ్, క్యారగారి అరవింద్, బిజెపి సీనియర్ నాయకులు నవారు శ్రీనివాస్ రెడ్డి, పోరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, కళ్లెం లక్ష్మారెడ్డి, పాలుబాయ్ అశోక్, పోరెడ్డి జగన్మోహన్ రెడ్డి, నిమ్మల రవికాంత్ గౌడ్, జిల్లా దిశ కమిటీ సభ్యులు అంబోజి శ్రీనివాస్, అంకంగారి రవి గౌడ్, నర్సింగ్ యాదవ్, తోట అరేందర్ రెడ్డి, గడ్డం ఇంద్రసేనా రెడ్డి, కొండల్ యాదవ్, వెంకటేష్ యాదవ్, బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షులు రాఘవేందర్ ముదిరాజ్, బీజేవైఎం నాయకులు పవన్ కుమార్, సతీష్ నంద, మధు తేజ, పోరెడ్డి నితిన్ రెడ్డి, మనీష్ ముదిరాజ్, నిఖిల్ సింగ్, భరత్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.