న్యూఢిల్లీ తమ కార్యాలయంలో CMPF కమిషనర్ మరియు కోల్ కంట్రోలర్ సజీష్ కుమార్ ఎన్. ను మర్యాదపూర్వకంగా కలిసిన పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ
మార్చి 18 న్యూఢిల్లీ:పెద్దపల్లి లోక్సభ నియోజకవర్గ ఎంపీ గడ్డం వంశీ కృష్ణ గారు ఈరోజు న్యూఢిల్లీలోని తమ కార్యాలయంలో CMPF కమిషనర్ మరియు కోల్ కంట్రోలర్ సజీష్ కుమార్ ఎన్. ను మర్యాదపూర్వకంగా కలిశారుఈ సందర్భంగా ‘కోల్ మైన్స్ పెన్షన్ పథకం (CMPF), 1998’ కింద పదవీ విరమణ చేసిన సింగరేణి బొగ్గు కార్మికుల పెన్షన్ సమస్యలపై కీలకంగా చర్చ జరిగింది. ప్రస్తుతం సింగరేణి నుంచి రిటైర్ అయిన కార్మికులకు వస్తున్న పెన్షన్ చాలా తక్కువగా ఉండటంతో వారు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఎంపీ గారు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.కష్టపడి జీవితాంతం పని చేసిన కార్మికులు గౌరవప్రదమైన జీవితం గడపాలంటే వారి పెన్షన్లు తక్షణమే పెంచాల్సిన అవసరం ఉందని ఎంపీ వంశీ కృష్ణ గారు స్పష్టం చేశారు. ఈ అంశాన్ని అత్యవసరంగా పరిగణించి, కేంద్ర ప్రభుత్వం స్థాయిలో తగిన చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.ఈ విషయంపై అధికారులు సానుకూలంగా స్పందిస్తూ, ప్రస్తుత నిబంధనల ప్రకారం పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.