రోడ్డు భద్రత పట్ల ఉద్యోగులు పౌరులను ప్రభావితం చేయాలి:ప్రసన్న కుమార్, డిఎస్పీ సూర్యాపేట సబ్ డివిజన్
జనవరి 16 సూర్యాపేట: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రోడ్డు భద్రత మహోత్సవాలు, పోలీసు అధ్వర్యంలో నిర్వహిస్తున్న అరైవ్ ఎలైవ్ కార్యక్రమంలో భాగంగా సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ ఆదేశాల మేరకు శుక్రవారం సూర్యపేట పట్టణ మున్సిపల్ కార్యాలయం నందు సూర్యాపేట పట్టణ, సూర్యాపేట ట్రాఫిక్ పోలీసుల అధ్వర్యంలో రోడ్డు భద్రత, అరైవ్ ఎలైవ్ అవగాహన సదస్సు నిర్వహించారు ఈ కార్యక్రమంలో డిఎస్పి ప్రసన్నకుమార్ మాట్లాడుతూ ప్రస్తుతం రోడ్డు ప్రమాదాల వల్ల ఎక్కువగా మరణాలు సంభవిస్తున్నాయని రోడ్డు ప్రమాదాలను రోడ్డు ప్రమాదం మరణాలను తగ్గించడంలో ప్రభుత్వ ఉద్యోగులు బాధ్యతగా ఉండాలని సూచించారు, రోడ్డు భద్రత పట్ల సామాన్య ప్రజలను పౌరులను యువతను ప్రభుత్వ ఉద్యోగులు ప్రభావితం చేయాలని కోరారు, ప్రయాణ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల పట్ల ప్రజలకు వివరించాల్సిన బాధ్యత మనపై ఉన్నదని అన్నారు. ప్రయాణం చేసే సమయంలో హెల్మెట్ ధరించాలని, మద్యం సేవించి వాహనాలు నడప వద్దని, హై స్పీడ్ తో వాహనాలు నడప రాదని తెలిపారు. పిల్లలకు వాహనాలు ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వకూడదని సూచించారు, పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రోడ్డు భద్రత కార్యక్రమాల పట్ల ఉద్యమంలా అవగాహన కార్యక్రమాలు, ఉద్యోగులు, పౌరులు దీనిలో భాగస్వామ్యం కావాలని కోరారు. రోడ్డు భద్రత పట్ల నియమ నిబంధనలు పాటిస్తూ ప్రమాద రహితంగా వాహనాలు నడుపుతామని కార్యక్రమంలో పాల్గొన్న వారితో ప్రతిజ్ఞ చేయించడం జరిగింది.ఈ కార్యక్రమంలో డీఎస్పీ ప్రసన్నకుమార్, ఎంఈఓ శ్రీనివాస్, ఆర్ ఎం ఓ లక్ష్మణ్, ట్రాఫిక్ ఎస్ఐ సాయిరాం, టౌన్ ఎస్ఐ లు మహేంద్ర నాథ్, శివ తేజ, ఐలయ్య, ఏఎంవిఐ విక్రమ్, ఏ ఎం వి ఐ సంపత్ పాల్గొన్నారు, ఉద్యోగులు పాల్గొన్నారు.