April 17, 2026

భారీ గణేష్ విగ్రహాలను పెట్టడం ముఖ్యం కాదు, భద్రత పాటించడం చాలా ముఖ్యం (రచయిత మసున లక్ష్మణ్ కుమార్)

0
IMG_20250820_084532

ఆగస్టు 20 హైదరాబాద్: నేటి యువత పండుగలను చాలా సంతోషంగా జరుపుకుంటున్నారు కానీ చిన్న చిన్న పొరపాట్ల వల్ల ప్రాణాలు కోల్పోతున్నారు. కొన్ని జాగ్రత్తలు మనం తప్పకుండా పాటించవలసి వస్తుంది. యువతకు ముఖ్యమైన సలహాలు ఏమిటంటే విగ్రహాలు పెట్టడం ముఖ్యమా లేదా భద్రత ఇతరులకు ఇబ్బంది కలగకుండా చూసుకోవడం ముఖ్యమా అని ఆలోచించాలి ముందుగా. హైదరాబాద్ లో చాలా చోట్ల భారీ విగ్రహాలను పెట్టి పూజలు చేస్తుంటారు, కానీ జాగ్రత్తలు మర్చిపోతుంటారు. ముఖ్యంగా గణేష్ మండపం దగ్గర కరెంటు మరియు సిబ్బంది నియమించుకోవాలి. కరెంట్ ఉన్నతాధికారుల ఫోన్ నెంబర్లు తప్పనిసరి అక్కడ మెన్షన్ చేసుకోవాలి. ఏదైనా ప్రమాదం జరిగిన వెంటనే 100కు డయల్ చేయాలి. ప్రతి ఒక్కరూ నియమాలు పాటిస్తే అందరూ సంతోషంగా ఉంటారు. కేబుల్ వైర్లు చాలా కిందికి వేలాడుతూ ఉంటాయి. దాన్ని సరి చేయాలని కేబుల్ ఆపరేటర్లకి ముందుగా సమాచారం తెలియజేయాలి వినాయకుని నిమజ్జనం చేసేటప్పుడు కేబుల్ వైర్లు తగలకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. కరెంట్ షాక్ తగిలిన వెంటనే చెస్ట్పై సిపిఆర్ చేసి వీలైనంతవరకు ప్రాణాలు కాపాడవచ్చు. భద్రత అనేది అందరి బాధ్యత

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed