April 18, 2026

మిత్రుల బృందం ఆధ్వర్యంలో టీడబ్ల్యూజేఎఫ్ సూర్యాపేట జిల్లా అధ్యక్షులు పాల్వాయి జానయ్య కు ఘన సన్మానం

0
IMG-20260306-WA1754

మార్చి 6సూర్యాపేట:జనవరి 23న జరిగిన తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్(టీడబ్ల్యూజేఎఫ్) సూర్యాపేట జిల్లా 4వ మహాసభ లో సూర్యాపేట జిల్లా అధ్యక్షులుగా పాల్వాయి జానయ్య ఏకగ్రీవంగా ఎన్నుకోవడం పట్ల మీడియా మిత్రులు. పట్టణ ప్రముఖులు హర్షం వ్యక్తం చేశారు.ఈ సందర్భముగా సూర్యాపేట జిల్లా స్పెషాలిటీ హోటల్ నందు ఘనంగా శాలువా, పూల బొకేతో సన్మానించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా మిత్ర బృందం సభ్యులు మాట్లాడుతూ మారుమూల గ్రామం తుంగతుర్తి, మండలం కేతేపల్లి, నల్గొండ జిల్లా కు చెందిన పాల్వాయి జానయ్య అతి చిన్న వయసులో విలేకరి వృత్తి లో రానించాలనే కోరికతో సూర్యాపేట పట్టణమునకు వచ్చి చిన్న పత్రికలో సత్య, రక్షణ పత్రిక ,ఆంధ్ర ప్రభ, సూర్య, ఆదాబ్ హైదరాబాద్, నేడు సూర్య సేన పత్రిక సంపాదకులుగా రానిస్తూ తెలంగాణ ప్రభుత్వం గుర్తింపు పొందిన సంఘం తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ సంఘం సూర్యాపేట జిల్లా అధ్యక్షులు గా ఎన్నిక కావడం తన నిబద్దత, కృషి, పట్టుదల కు నిదర్శనం అనీ కొనియాడారు.ఈ కార్యక్రమంలో సుమన్ యువ సేన అధ్యక్షులు గుండా వెంకన్న,ఉపాధ్యాయులు గోపారపు రాజు, సీనియర్ జర్నలిస్టు, ఫోటోగ్రాఫర్ బచ్చు పురుషోత్తం, జర్నలస్టు మిత్రులు కొండ్లె కృష్ణయ్య, మామిడి శంకర్, దుర్గం బాలు, బానుపురి సేవా బృందం నిర్వాహకులు శ్రీరంగం రాము, డో గుపర్తి ప్రవీణ్,యామా సంతోష్, బజ్జూరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed