April 17, 2026

నూతన విద్యుత్ స్తంభాలు, విద్యుత్తు లైట్లు గోపాల్ నగర్ నూతన పార్కు చుట్టుపక్కల ఏర్పాటు చేయండి: గాదె శివ, కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ యువ నేత

0
99e686c953984a349ce5dfa8b725f675(1)

మార్చి 16 కూకట్ పల్లి:గోపాలనగర్ ప్రాంతంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలనే ఉద్దేశంతో కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ నేత గాదె శివ జిహెచ్ఎంసి ఎలక్ట్రికల్ డిపార్ట్‌మెంట్ డీఈ స్వప్న రాజు గారిని కలిసి వినతిపత్రం సమర్పించారు.గోపాలనగర్ పార్కు చుట్టుపక్కల నూతన స్తంభాలు,వీధి లైట్లు ఏర్పాటు చేయాలని, అలాగే ఎస్‌ఎంఆర్ వినయ్ నుంచి గోకుల్ ప్లాట్స్ వరకు మరియు ఎస్‌ఎంఆర్ వినయ్ నుంచి ఎన్‌ర్స్ఏ
కాలనీ వరకు సుమారు ఒక కిలోమీటర్ పొడవునా నూతన స్తంభాలు ఏర్పాటు చేసి వీధి లైట్లు ఏర్పాటు చేయాలని కోరారు. ఈ ప్రాంతాల్లో చీకటి ఎక్కువగా ఉండడంతో ప్రజలు రాత్రి వేళల్లో ఇబ్బందులు పడుతున్నారని ఆయన తెలిపారు.

దీనిపై స్పందించిన జిహెచ్ఎంసి ఎలక్ట్రికల్ డిపార్ట్‌మెంట్ డీఈ స్వప్న రాజు గారు అవసరమైన ఎస్టిమేషన్ సిద్ధం చేసి టెండర్ ప్రక్రియ పూర్తి చేసి ఒక నెలలోగా నూతన స్తంభాలు మరియు వీధి లైట్లు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.

కెపిహెబీ డివిజన్ & వసంత నగర్ డివిజన్లలో అడిగిన వెంటనే ప్రతి కాలనీలో కూడా వీధిలైట్ల ఏర్పాటుచేసి సమస్యలు పరిష్కరించినందుకుగాను జిహెచ్ఎంసి డిఈ కి కృతజ్ఞతలు తెలియజేసిన యువ నేత

ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు మరియు కాలనీ వాసులు పాల్గొన్నారు.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed