“మన ఊరు మన వాడ” శుభ్రంగా ఉంచుకోవడానికి అందరూ కలిసికట్టుగా నడవాలి. రోడ్లమీద మరియు ఎక్కడ పడితే అక్కడ చెత్త వెయ్యకుండా అలవాటు మానుకోవాలి
ఫిబ్రవరి 23 హైదరాబాద్: మన ప్రాంతంలో చాలామంది చెత్తని ఎక్కడపడితే అక్కడ వేయకుండా అందరం కలిసికట్టుగా ఉండాలి. ప్రతి బస్తీలో ఉన్నది చెత్త సమస్య. చదువుకున్న వాలు కూడా తమ బస్తీ గురించి ఆలోచన చెయ్యడంలేదు. ప్రతిబస్తిలో చెత్తని రోడ్లమీద వేస్తున్నారు. ఆలోచన చెయ్యాలి నెలలో ఎంతో ఖర్చు చేస్తారు కానీ చెత్తని తీసుకెళ్లే ఆటో వాళ్లకి 100 రూపాయలు ఇవ్వడానికి మనసు రావడంలేదు. ప్రతి ఒక్క ఆలోచన చేయాలి మన గ్రామం, మన బస్తి శుభ్రంగా ఉంచుకుంటే ఎలాంటి రోగాలు రావు, దోమల భారీ నుండి మనల్ని మనం రక్షించుకోవచ్చు. ఉదయం పూట వాకింగ్లో చేసుకోవాలనుకున్న వాళ్ళు కూడా తీవ్ర ఇబ్బంది పడుతున్నారు, రోడ్లమీద చెత్తని వేయడంతో కుప్పలు కుప్పలుగా పేరుకుపోయి దురువాసనతో ఇబ్బంది పడుతున్నారు.