February 22, 2026

నేటి విశేషం మాఘ అమావాస్య (ఎలాంటి పూజలు చేస్తే ఫలితాలు ఉంటాయి తెలుసుకుందాం)

0
IMG_20260217_091547

ఫిబ్రవరి 17 హైదరాబాద్:మాఘ అమావాస్య, అత్యంత పవిత్రమైన రోజులలో మాఘ అమావాస్య ఒకటి.
దీనిని మౌని అమావాస్య, మాఘీ అమావాస్య అని కూడా అంటారు…
అందుకే ఈరోజున పూజలు చేసేవారంత మౌనవ్రతం చేస్తారు, గంగానది నీరు మౌని అమావాస్య నాడు అమృతంగా మారుతుందని నమ్ముతారు.
దీనివల్ల ఆరోజు స్నానం చేయటానికి గంగానది ముఖ్యమైన నదిగా మారింది.

కేవలం మౌనీ అమావాస్య రోజు మాత్రమే కాకుండా ఈ నెల మొత్తాన్ని అత్యంత పవిత్ర మాసంగా భావిస్తారు.
పుష్య పూర్ణిమ రోజు మొదలు పెట్టి మాఘ పూర్ణిమ వరకు వ్రతాన్ని పూర్తి చేస్తారు.
ఈరోజు సాధువులు మౌనంగా ఉంటారు, దీన్ని జ్ఞానంను నిద్రలేపే చర్యగా భావించి, దానికోసం మాటలు అవసరం లేదని భావిస్తారు.
చందమామ మన మనస్సులను నియంత్రించే గ్రహమని నమ్ముతుంటారు.
మౌని అమావాస్య నాడు చంద్రుడు మనకు కనిపించడు.
ఈ రోజు మాట్లాడే మాటలు, తీసుకునే నిర్ణయాలు మంచి ఫలితాలను కలిగించవు అని అంటుంటారు. శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పినట్లు “మన మనస్సే మనకి గొప్ప స్నేహితుడు, అందుకని దానికి సరిగ్గా శిక్షణనిస్తే నియంత్రణలో ఉంటుంది. దానికి మీ మీద నియంత్రణనిస్తే అదే గొప్ప శత్రువుగా మారవచ్చు.” శరీరాన్ని, మనస్సును, ఆత్మను శుద్ధిచేసుకోవడానికి పవిత్రనదుల్లో స్నానం చేయడం, మౌనంగా ఉండాలనేది ఈ అమావాస్య ప్రతీతి.

పితృపూజ చేయటానికి మౌని అమావాస్య మంచిరోజు. ఈరోజు మీరు మీ పూర్వీకులను గుర్తు చేసుకుని, వారి జ్ఞాపకాలను గౌరవిస్తూ, వారి ఆశీస్సులు పొందుతారు. ధ్యానం చేయడమనేది చాలా మంచి ప్రక్రియ. అలాగే మంతాలను ఉఛ్చారించడం, సంగీతం వినడం వలన మనసు శాంతిగా ఉంటుంది. చంద్రుడితో సంబంధం ఉన్నందున రుద్రాక్షమాలను ఈరోజు మీరు ధరించవచ్చు. కాకపోతే రుద్రాక్షలు ద్విముఖి లేదా పదహారు ముఖి అయివుండాలి. ఇవి వేసుకున్నవారికి ఆందోళన తగ్గి ప్రశాంతత ఏర్పడుతుంది. మౌని అమావాస్య నాడు శనీశ్వరుడిని కూడా పూజిస్తారు. నువ్వులు లేదా తిల్ నూనెతో ఈ రోజు శనీశ్వరుడికి అభిషేకం చేస్తారు. మౌని అమావాస్య రోజు ప్రతి ఒక్కరూ ఉపవాస దీక్షలతో వారి ఇష్టదైవానికి పూజలు చేసుకొని, వారి స్తోమతకు తగ్గట్టుగా దానధర్మాలను చేయాలి. ముఖ్యంగా నువ్వులు, నల్ల బట్టలు, నూనె వంటి వస్తువులను దానం చేయటం వల్ల శుభం జరుగుతుంది. అదేవిధంగా ఈ మౌని అమావాస్య రోజు సాక్షాత్తు ఆ విష్ణు భగవానుడికి నువ్వుల నూనెతో దీపారాధన చేయడం వల్ల సకల సంపదలు కలుగుతాయని ఆధ్యాత్మిక పండితులు చెబుతారు.

         *_🌷శుభమస్తు🌷_*

🙏 సమస్త లోకా సుఖినోభవంతు 🙏

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed