కాంగ్రెస్ పార్టీ వికలాంగుల విభాగంలో సభ్యత్వ నమోదు ప్రక్రియను మరింత సులభతరం చేసేలా రూపొందించిన సభ్యత్వ నమోదు యాప్‌ను ప్రారంభించారు టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్
జనవరి 22 హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ వికలాంగుల విభాగంలో సభ్యత్వ నమోదు ప్రక్రియను మరింత సులభతరం చేసేలా రూపొందించిన సభ్యత్వ నమోదు యాప్‌ను టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారు గాంధీ భవన్‌లో అధికారికంగా ప్రారంభించారు.
- ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ గారు మాట్లాడుతూ, వికలాంగుల హక్కుల పరిరక్షణకు కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ కట్టుబడి ఉందని, వారి రాజకీయ భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలిపారు. ఆధునిక సాంకేతికతను ఉపయోగించి వికలాంగుల విభాగాన్ని మరింత బలపరిచే దిశగా ఇది కీలక ముందడుగుగా నిలుస్తుందని అన్నారు.
- ఈ కార్యక్రమంలో వికలాంగుల విభాగం కార్పొరేషన్ చైర్మన్ ముత్తినేని వీరయ్య కాంగ్రెస్ పార్టీ వికలాంగుల విభాగం నాయకులు, పార్టీ ముఖ్య నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.