11వ రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్ అథ్లెటిక్స్ పోటీల కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న నిర్మల్ జిల్లా డీసీసీ అధ్యక్షులు, ఖానాపూర్ శాసనసభ్యులు వెడ్మ బొజ్జు పటేల్
జనవరి 18 ఆదిలాబాద్:- జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియం లో 11వ రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్ అథ్లెటిక్స్ పోటీలు ఆదివారం అట్టహాసంగా ప్రారంభం అయ్యాయి. ఈ కార్యక్రమానికి నిర్మల్ జిల్లా డీసీసీ అధ్యక్షులు, ఖానాపూర్ శాసనసభ్యులు వెడ్మ బొజ్జు పటేల్ గారు ముఖ్య అతిధిగా హాజరై పోటీలను ప్రారంభించారు. సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ “దేశానికి వెన్నుముక నేటి క్రీడాకారులు” అన్నారు. క్రీడా రంగంలో అభివృద్ధి సాధించాలంటే క్రీడాస్పూర్తి అత్యవసరం, ఓటమికి భయపడకుండా ధైర్యంగా ముందుకు సాగాలని, ఇంటర్నేషనల్ ప్లేయర్ మెస్సి గారిని ఆదర్శంగా తీసుకోవాలని క్రీడాకారులకు సూచించారు.
రాష్ట్రంను స్పోర్ట్స్ వేదికగా చేయడానికి ఇంటర్నేషనల్ ఫుట్ బాల్ ప్లేయర్ మెస్సితో సీఎం రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్ వేదికగా ఫుట్ బాల్ మ్యాచ్ ఆడారని అన్నారు.
రాష్ట్రంలో క్రీడాకారులకు అవసరమైన మౌలిక వసతులు, శిక్షణ కేంద్రాలు, కోచింగ్ క్యాంపులు ఏర్పాటు చేస్తూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ప్రథమ ప్రాధాన్యతనిస్తూ, రాష్ట్ర ప్రభుత్వం భారీ నిధులు కేటాయించిందని తెలిపారు.
టాలెంట్ ఉన్న ప్రతి విద్యార్థికి – గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఉన్నత స్థాయి వేదికలను అందించాలనే దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని వెల్లడించారు. “క్రీడల్లో విజయం సాధించాలంటే దృఢ సంకల్పం, శ్రమ, క్రమశిక్షణ అవసరం. విజయం లభించకపోయినా పాఠం నేర్చుకుని ముందుకు సాగాలి. మీరు ఆడే ప్రతి మెట్టు, మీరు పెట్టే ప్రతి అడుగు – రాష్ట్రానికి, దేశానికి గౌరవం తీసుకురావాలి” అని అభిప్రాయపడ్డారు.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందన్ గారు,ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్, జిల్లా డీసీసీ అధ్యక్షులు నరేష్ జాదవ్,జిల్లా కలెక్టర్ రాజర్శి షా, జిల్లా అథ్లెటిక్స్ ప్రెసిడెంట్ అడ్డి భోజ రెడ్డి,గ్రంథాలయం చైర్మన్ మల్లెపూల నర్సయ్య,జిల్లా ఓలంపిక్స్ అధ్యక్షుడు బాలూరి గోవర్ధన్ రెడ్డి, మాజీ టీపీసీసీ జనరల్ సెక్రటరీ గండ్రత్ సుజాత, కిసాన్ సెల్ శ్రీకాంత్ రెడ్డి, ఆదిలాబాద్ జిల్లా ముఖ్య నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.