February 22, 2026

జర్నలిస్ట్ ప్రొటెక్షన్ ఫోర్స్ రాష్ట్ర సారథిగా పర్కాల సమ్మయ్య గౌడ్.ఉప్పల్ విద్యానికేతన్‌లో జరిగిన జర్నలిస్టుల సమావేశంలో ఏకగ్రీవ నియామకం:జర్నలిస్టుల రక్షణే ధ్యేయంగా పనిచేస్తానని వెల్లడి

0
IMG-20260105-WA1138

హైదరాబాద్ జనవరి 5::అఖిల భారతీయ జర్నలిస్ట్ ప్రొటెక్షన్ ఫోర్స్ (ఏఐజేపీఎఫ్) తెలంగాణ రాష్ట్ర నూతన అధ్యక్షుడిగా సీనియర్ పాత్రికేయులు పర్కాల సమ్మయ్య గౌడ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సోమవారం హైదరాబాద్‌లోని ఉప్పల్ విద్యానికేతన్‌లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి జర్నలిస్టుల విస్తృత స్థాయి సమావేశంలో ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు.రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల నుండి విచ్చేసిన పత్రికా సంపాదకులు, సీనియర్ జర్నలిస్టులు ఈ సమావేశంలో పాల్గొని సమ్మయ్య గౌడ్ అభ్యర్థిత్వానికి పూర్తి మద్దతు ప్రకటించారు. జర్నలిస్టుల సంక్షేమం, వృత్తిపరమైన రక్షణ కోసం ఆయన నిరంతరం కృషి చేస్తారనే నమ్మకంతో ఈ బాధ్యతలను అప్పగించినట్లు ప్రతినిధులు తెలిపారు.
ఈ సందర్భంగా ఎన్నికైన రాష్ట్ర అధ్యక్షుడు పర్కాల సమ్మయ్య గౌడ్ మాట్లాడుతూ: “తనపై నమ్మకంతో ఈ బాధ్యతను అప్పగించిన జర్నలిస్టు మిత్రులందరికీ ధన్యవాదాలు. తెలంగాణ రాష్ట్రంలో పని చేస్తున్న జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి, వారి హక్కుల రక్షణకు అఖిల భారతీయ జర్నలిస్ట్ ప్రొటెక్షన్ ఫోర్స్ తరపున అంకితభావంతో పనిచేస్తాను. ప్రభుత్వం నుండి జర్నలిస్టులకు అందాల్సిన సంక్షేమ పథకాలు, ఇతర సౌకర్యాల సాధనలో ముందుంటాను,” అని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో తెలంగాణలోని వివిధ జిల్లాలకు చెందిన జర్నలిస్టు సంఘాల నేతలు, సీనియర్ పాత్రికేయులు పాల్గొని సమ్మయ్య గౌడ్‌ను ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.

ఉప్పల్ విద్యానికేతన్‌లో జరిగిన జర్నలిస్టుల సమావేశంలో ఏకగ్రీవ నియామకం:

జర్నలిస్టుల రక్షణే ధ్యేయంగా పనిచేస్తానని వెల్లడి.

జర్నలిస్ట్ ప్రొటెక్షన్ ఫోర్స్ రాష్ట్ర సారథిగా పర్కాల సమ్మయ్య గౌడ్.

ఘనంగా సత్కరించిన వివిధ జిల్లాల పత్రికా సంపాదకులు మరియు సీనియర్ జర్నలిస్టులు.హైదరాబాద్ వేదికగా జరిగిన విస్తృత స్థాయి సమావేశంలో కీలక నిర్ణయం.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed