February 22, 2026

శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి గారిని కలిసి తన రాజీనామా ఆమోదం గురించి చర్చించిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గారు

0
IMG-20260102-WA1214

జనవరి 2 హైదరాబాద్:అసెంబ్లీలో మీడియా పాయింట్ వద్ద మాట్లాడిన జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత.కేసీఆర్ ను టెర్రరిస్ట్ తో పోల్చుతూ రేవంత్ చేసిన విమర్శలకు నా రక్తం మరుగుతోంది.ముఖ్యమంత్రి తన మాట తీరు మార్చుకోవాలని హెచ్చరిస్తున్నా.పాలమూరు-రంగారెడ్డి ద్వారా ఒక్క ఎకరానికి నీళ్లు ఇవ్వలేదన్నది నూటికి వెయ్యి శాతం నిజం.ఇన్ టేక్ పాయింట్ ఎందుకు మార్చారో కేసీఆర్ గారే వివరించాలి.బబుల్ షూటర్ కు పెత్తనం ఇచ్చి సమాధానం చెప్పిస్తే ప్రజలకు అర్థం కాదు.కేసీఆర్ గారు అసెంబ్లీకి రాకపోతే బీఆర్ఎస్ ను దేవుడు కూడా కాపాడలేడు.ఆంధ్రా నాయకులు రాజకీయాలకు అతీతంగా మన నీళ్లు దోచుకుంటున్నారు.తెలంగాణ నాయకులకు మాత్రం ఎందుకు ఆ చిత్తశుద్ధి లేదు?నా రాజీనామా ఆమోదించే ముందు కౌన్సిల్ లో మాట్లాడే అవకాశం కోరాను.ఈ నెల 5 న కౌన్సిల్ లో మాట్లాడుతాను. నా రాజీనామాకు కారణాలను ప్రజలకు వివరిస్తా.తెలంగాణ ప్రజలందరికీ నూతన సంవతర్సర శుభాకాంక్షలు.

ఈ ఏడాదిలో కోరుకున్న పనులన్నీ నెరవేరాలని ఆడబిడ్డగా ఆకాంక్షిస్తున్నా.

నేను ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి నాలుగు నెలలైంది. అయినా నా రాజీనామాను ఆమోదించలేదు.

నా రాజీనామాను ఆమోదించాలని శాసన మండలి ఛైర్మన్ గారిని కోరాను.

అదే విధంగా రాజీనామా ఆమోదానికి ముందు నాకు కౌన్సిల్ లో మాట్లాడే అవకాశం ఇవ్వాలని కోరాను.

ఈ నెల 5 వ తేదీన నాకు మాట్లాడే అవకాశం ఇస్తామన్నారు.

ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఆ రోజే నా రాజీనామాకు కారణాలను తెలంగాణ ప్రజలకు తెలియజేస్తాను.

పార్లమెంటరీ ప్రొసిజర్స్ కు కచ్చితంగా మనం ఫాలో అవ్వాలి.

ఈ రాష్ట్రంలో రాజకీయ పరిణామాలను మనం చూస్తున్నాం.

పాలమూరు-రంగారెడ్డి ద్వారా ఈ 12 ఏళ్లలో ఒక్క ఎకరం నీరు కూడా ఇవ్వలేదన్నది నూటికి వెయ్యి శాతం వాస్తవం.

ప్రాజెక్ట్ ను 10 ఏళ్లు బీఆర్ఎస్ సాగదీసిందంటూ ముఖ్యమంత్రి చేసిన విమర్శలను తీవ్రంగా ఖండిస్తున్నాం.

ఉద్యమ నాయకుడిని కసబ్ లాంటి టెర్రరిస్ట్ తో పోల్చటం సరికాదు.

రాళ్లతో కొట్టాలి, ఉరి తీయాలంటూ మాట్లాడటమంటే అవి ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి మాటల మాదిరిగా లేవు.

కేసీఆర్ కూతురు గా రేవంత్ రెడ్డి చేస్తున్న విమర్శలకు నా రక్తం మరుగుతోంది.

కేసీఆర్ గారి ఉద్యమ ఫలితంగానే తెలంగాణ సాధించుకున్నాం.

అలాంటి రాష్ట్రానికే రేవంత్ రెడ్డి సీఎం అయ్యారు. అలాంటి వ్యక్తి కేసీఆర్ పై చేసే విమర్శలు సరికాదు.

ఆరోపణలు చేస్తున్న వారి నోళ్లు మూతపడేలా కేసీఆర్ గారు చేయాలి.

కేసీఆర్ గారి చిత్తశుద్దిని శంకిస్తున్నారు. అందుకే నేను కేసీఆర్ గారి రిక్వెస్ట్ చేస్తున్నా.

జూరాల నుంచి శ్రీశైలం కు ఇన్ టేక్ పాయింట్ ఎందుకు మార్చారో ఆయనకే బాగా తెలిసి ఉంటుంది.

బబుల్ షూటర్ లాంటి వాళ్లకు డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పదవులు ఇచ్చి జవాబు చెప్పిస్తే ప్రజలకు అర్థం కాదు.

అసలు బబుల్ షూటర్ వల్లే ట్రబుల్ వచ్చింది. బబుల్ షూటర్ కారణంగానే మొదటి ప్యాకేజీకి దెబ్బ పడ్డది.

ఆయన కారణంగానే పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్ట్ ఇబ్బందుల్లో పడింది.

ఇంకా అలాంటి వాళ్లకే పెత్తనం ఇచ్చి వారితో సమాధానం చెప్పిస్తున్నారు.

కేసీఆర్ గారు అసెంబ్లీకి రాకపోతే బీఆర్ఎస్ ను భగవంతుడు కూడా కాపాడలేదు.

తెలంగాణ ప్రజల ప్రయోజనం కోసం కేసీఆర్ గారు అసెంబ్లీకి రావాలి.

అనుకోకుండా అందలం ఎక్కిన వ్యక్తి తో కేసీఆర్ గారు మాటలు పడాల్సిన అవసరమేముందీ?

కాంగ్రెస్ పాలనలో కూడా రెండేళ్లలో పాలమూరు- రంగారెడ్డి ద్వారా ఒక్క ఎకరం నీళ్లు ఇవ్వలేదు.

మాట్లాడితే పాలమూరు బిడ్డను అని ప్రగల్భాలు పలికే సీఎం ఎందుకు నీళ్లు ఇవ్వలేదు.

పాలమూరు-రంగారెడ్డికి లీగల్ ఇష్యూస్ ఉన్నాయి అనుకుందాం.

బీమా, నెట్టంపాడు, సుందిళ్ల, కల్వకుర్తికి ఏమైంది? కల్వకుర్తిలో రెండు మోటార్ల రిపేర్ కు ఎందుకు పైసా కూడా ఇవ్వలేదు?

బీమా సగం కెపాసిటీ తోనే ఉంది. నెట్టంపాడు 4 టీఎంసీలు అయితే 2 టీఎంసీల నీళ్లు కూడా లేవు.

ముఖ్యమంత్రి గారు ప్రెస్ మీట్ పెట్టి కేసీఆర్ గారిని విమర్శించారు.

మరి కొడంగల్- నారాయణ్ పేట్ -మక్తల్ లిప్ట్ ఇరిగేషన్ ఎందుకు బీమాను ఇన్ టేక్ పాయింట్ గా తీసుకున్నారు.

బీమా చిన్న పిల్ల కాల్వ. మీకు ఆంధ్రా నేతలతో ఏం లాలూచీ ఉంది?

ఆంధ్రాలో చంద్రబాబు, జగన్ రాజకీయాలను పక్కన పెట్టి వాళ్ల ప్రాంత ప్రయోజనాల కోసం మన నీళ్లు దోచుకుంటున్నారు.

కానీ తెలంగాణ నాయకుల్లో మాత్రం ఆ చిత్తశుద్ధి లోపించింది.

దాదాపు రెండేళ్లను పాటు మేడిగడ్డను ఎండబెట్టిన ముఖ్యమంత్రికి ఇప్పుడు జ్ఞానోదయం అయ్యింది.

మేడిగడ్డ రిపేర్ కోసం కాంట్రాక్ట్ పనులు ఇస్తారంట.

రెండేళ్ల పాటు వేలాది మంది రైతులకు అన్యాయం చేశారు. వాళ్ల కడుపుకోత మీకు తగులుతుంది.

రెండేళ్లు టైమ్ పాస్ చేసి ఇప్పుడు కృష్ణా నీళ్లకు సంబంధించి ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారు.

కానీ పాలమూరు బిడ్డగా మీరు పూర్తిగా వైఫల్యం చెందారు.

ఆ ప్రాజెక్ట్ అయినా సరే రాజకీయాలకు అతీతంగా ప్రజా ప్రయోజనాలను కాపాడే విధంగా పనులు చేయాలి.

ప్రాజెక్ట్ ను ఆపి ప్రతిపక్షాలను బద్నాం చేసే రాజకీయాలు వద్దని కోరుతున్నా.

ఇకనైనా పాలమూరు- రంగారెడ్డి ఇన్ టేక్ సోర్స్ మార్చాలని డిమాండ్ చేస్తున్నా.

పాలమూరు కు సంబంధించి ఎన్జీటీ లో స్టే ఉందని సీఎం చెబుతున్నారు.

మరి ఆంధ్రాకు సంబంధించి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్, పోతిరెడ్డి పాడు కు స్టే ఉంది.

కానీ ఆంధ్రా నాయకులు మాత్రం పనులు కొనసాగించారు. ఈ విషయాన్ని తెలంగాణ ప్రజలు గమనించాలి.

ఇప్పటికే 27 వేల ఎకరాల భూ సేకరణ చేసిన ప్రాజెక్ట్ కు సంబంధించి ఒక్క కాలువ కూడా కట్టలేదు.

డిప్యూటీ సీఎం వద్ద పాలమూరు-రంగారెడ్డి సహా 12 వేల ఫైళ్లు పెండింగ్ లో ఉన్నాయి.

ప్రతిపక్షాన్ని తిడుతూ కాలం గడుపుతామంటే ఇది ఎడ్డి, గుడ్డి తెలంగాణ కాదు.

ప్రజలకు అన్ని వాస్తవాలు తెలుసు. వారికి వాస్తవాలు తెలిసేలా చేసేందుకు జాగృతి బయలుదేరింది

కాంగ్రెస్ ను బీఆర్ఎస్, బీఆర్ఎస్ ను కాంగ్రెస్ తిట్టేందుకే అసెంబ్లీ పెట్టారు.

ఇక్కడ టైమ్ పాస్ చేస్తూ, రీల్స్ చేస్తూ బయటకు వస్తున్నారు.

మరోసారి తెలంగాణ సీఎం తన మాట తీరు మార్చుకోవాలని చెబుతున్నా.

తెలంగాణ పౌరుషాన్ని సూచించేలా ఆయన మాట తీరు లేదు.

కేసీఆర్ గారి టెర్రరిస్టుతో పోల్చటమంటే మీరు దేశ ద్రోహం చేస్తున్నట్లే.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed