ఫిబ్రవరి రెండో వారంలో మున్సిపల్ ఎన్నికలు – తెలంగాణలో కీలక నిర్ణయం
డిసెంబర్ 27 హైదరాబాద్:ఫిబ్రవరిలో గడువు ముగియనున్న జీహెచ్ఎంసీతో పాటు మిగతా పట్టణ స్థానిక సంస్థలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
విద్యార్థుల పరీక్షల సీజన్ మొదలయ్యేలోగానే ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని యోచిస్తోంది.
🔹 మినహాయింపులు:
ఖమ్మం, వరంగల్ కార్పొరేషన్లు,
మహబూబ్‌నగర్, నల్గొండ జిల్లాల్లోని రెండు మున్సిపాలిటీలకు ఏప్రిల్ వరకు గడువు ఉండటంతో వాటిని ఈ దశలో మినహాయించనున్నారు.
📝 ఎన్నికల కమిషన్ సన్నాహాలు:
ఎన్నికలు ఎప్పుడైనా జరగొచ్చన్న నేపథ్యంలో
👉 జనవరి రెండో వారంలోపే ఓటర్ల జాబితా సిద్ధం చేసే పనిలో EC నిమగ్నమైంది.