రాష్ట్ర ప్రభుత్వ తొందరపాటు వల్లే తమకు అన్యాయం :తెల్ల హరికృష్ణ
మన ఊరి న్యూస్ కూకట్ పల్లి ప్రతినిధి ఈ.పద్మారావు కాపు అక్టోబర్ 09:స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు స్టే విధించడంపై బీసీ నేత తెల్ల హరికృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని, బీసీల నోటికాడి ముద్దను లాగేశారని అన్నారు. బీసీలు ఎంపీటీసీలు జడ్పీటీసీలు అయితే కూడా ఓర్వరా రాష్ట్ర ప్రభుత్వ తొందరపాటు వల్లే తమకు అన్యాయం జరిగిందని విమర్శించారు. బీసీల సత్తా ఏంటో చూపిస్తామన్నారు. కోర్టులను అడ్డంపెట్టుకుని బీసీ రిజర్వేషన్లను అడ్డుకోవాలని చూస్తే తగిన గుణపాఠం తప్పదు అని రాష్ట్ర బీసీ నాయకులు జర్నలిస్టు తెల్ల హరికృష్ణ అన్నారు.