దిల్సుక్నగర్లో నిరుద్యోగుల భారీ ర్యాలీ.
ఉద్యోగాలు ఇచ్చామంటూ ప్రభుత్వం గొప్పలు చెప్పుకోవడం సరికాదు
.మన ఊరి న్యూస్ దిల్సుక్నగర్ ప్రతినిధి ఈ.పద్మారావు కాపు సెప్టెంబర్ 24: దిల్సుక్నగర్లో ఈ రోజు నిరుద్యోగులు భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వ ఉద్యోగ క్యాలెండర్ విడుదల చేయాలని, విద్యుత్ రంగం, ఏఈ,ఎస్ఈ & జేఎల్ఎం,ఎస్సై, పిసి, డీఎస్సీ మరియు ఇతర విభాగాల్లో ఖాళీలను తక్షణం భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.నిరుద్యోగుల ఆందోళనకు మద్దతుగా అశోక్ నిరాహార దీక్ష కొనసాగిస్తున్నారు.ఇప్పటికే ఆయన ఆరోగ్యం క్షీణించడంతో ఉస్మానియా హాస్పిటల్లో అడ్మిట్ చేశారు.తొమ్మిది రోజులుగా ఆయన దీక్ష చేస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడాన్ని నిరుద్యోగులు తీవ్రంగా విమర్శించారు.డీఎస్సీ లో ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులు,వైద్య రంగం,విద్యుత్ రంగం సహా అనేక శాఖల్లో వందల కొద్దీ ఖాళీలు ఉన్నప్పటికీ ప్రభుత్వం వాటిని భర్తీ చేయడంలో విఫలమవుతోందని పేర్కొన్నారు.కొత్త ఉద్యోగ నోటిఫికేషన్లు లేకపోవడం వల్ల విద్యార్థులు,నిరుద్యోగులు ఇబ్బందులు పడుతున్నారని ఆందోళనకారులు తెలిపారు.ఉద్యోగాలు ఇచ్చామంటూ ప్రభుత్వం గొప్పలు చెప్పుకోవడం సరికాదు.పాత నియామకాలను ప్రమోషన్లతో మలిచేస్తూ కొత్త అవకాశాలను నిరాకరిస్తోంది అని నిరుద్యోగులు ఆరోపించారు.