February 22, 2026

పర్యావరణ పరిరక్షణ మన అందరి బాధ్యత – శ్రీరాములు అందెల.చెట్లను నాటుదాం. పర్యావరణాన్ని కాపాడుదాం – బిజెపి కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కొండపల్లి శ్రీధర్ రెడ్డి

0
IMG-20250702-WA0840

జూలై 2:మహేశ్వరం నియోజకవర్గం బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ లోని నాదర్గుల్ గ్రామంలో గౌరవనీయులు శ్యామ ప్రసాద్ ప్రసాద్ ముఖర్జీ గారి బలిదాన్ దివస్ పురస్కరించుకొని ఈరోజు బిజెపి కిసాన్ మోర్చా ఏపీఎంసీ కన్వీనర్ మరియు మాజీ ఎంపీటీసీ సభ్యులు ఏనుగు రామ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వారి వ్యవసాయ క్షేత్రంలో కిసాన్ సంవాద్ కార్యక్రమంలో భాగంగా అమ్మ పేరుతో మొక్కలు నాటే కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బిజెపి రాష్ట్ర కిసాన్ మోర్చా అధ్యక్షులు కొండపల్లి శ్రీధర్ రెడ్డి గారు, బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మహేశ్వరం నియోజకవర్గ ఇన్చార్జ్ అందెల శ్రీరాములు గారు, మాజీ రంగారెడ్డి రూరల్ జిల్లా బిజెపి అధ్యక్షులు బొక్క నర్సింహారెడ్డి గారు హాజరై మొక్కలను నాటడం జరిగింది. ఈ సందర్భంగా కొండపల్లి శ్రీధర్ రెడ్డి గారు మాట్లాడుతూ రోజురోజుకు ప్లాస్టిక్ వాడకం అధికం కావడంతో పర్యావరణం పై పేను ప్రభావం పడుతుందన్నారు. ప్రతి ఒక్కరూ మానవత దృక్పథంతో తమ వంతుగా చెట్లను నాటి పర్యావరణన్ని పరిరక్షించేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కిసాన్ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అంజయ్య యాదవ్, బిజెపి రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ తర్రే మల్లేష్ యాదవ్, కార్పొరేషన్ బిజెపి అధ్యక్షులు రామిడి వీరకర్ణ రెడ్డి, బిజెపి సీనియర్ నాయకులు ఏనుగు ప్రభాకర్ రెడ్డి, మాజీ కార్పొరేషన్ అధ్యక్షులు చెరుకుపల్లి వెంకట్ రెడ్డి, మాజీ కార్పొరేటర్లు తోట శ్రీధర్ రెడ్డి, నిమ్మల సునీత శ్రీకాంత్ గౌడ్, గూడెపు ఇంద్రసేన, గడ్డం లక్ష్మారెడ్డి, దడిగ శంకర్, రామోజీ అమితా శ్రీశైలం చారి, సహకార బ్యాంక్ డైరెక్టర్ తోట ప్రతాపరెడ్డి, మాజీ సహకార బ్యాంక్ డైరెక్టర్ ఏనుగు వెంకట్ రెడ్డి, బిజెపి సీనియర్ నాయకులు పాలు బాయ్ లక్ష్మణ్, గూడూరు శేఖర్ రెడ్డి, ఏనుగు రామ్ రెడ్డి, మర్రి అంజిరెడ్డి, శక్తి కేంద్ర ఇన్చార్జ్ నిమ్మల రవికాంత్ గౌడ్, ఏనుగు బుచ్చిరెడ్డి, ఏనుగు జంగారెడ్డి, తోట అరేందర్ రెడ్డి, మంత్రి శ్రీధర్ ముదిరాజ్, బంగారు సుమన్, లాలం బాల నరసింహ యాదవ్, ఎడ్ల శ్రీశైలం ముదిరాజ్, భాస్కర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed