February 22, 2026

ఇల్లు మంజూరు అయిందని మోసం చేశారు వికలాంగుని ఆవేదన

0
IMG-20250630-WA0838

జూన్ 30:కామారెడ్డి జిల్లా సదాశివ నగర్ మండల కేంద్రానికి చెందిన కమ్మరి రాజయ్య ఇందిరమ్మ ఇళ్లలో మంజూర అయిందని అధికారులు ప్రకటించి మళ్లీ ఇప్పుడు రాలేదంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు సోమవారం మండల కేంద్రంలో బారాస నాయకులను కలిసి అధికారుల తీరు కాంగ్రెస్ నాయకుల చేష్టలను వివరించారు తనకి ఇల్లు మంజూరు అయింది ముగ్గు పోయాలని అధికారుల వద్దకు స్థానిక కాంగ్రెస్ నాయకుల వద్దకు వెళ్తే తమను కలవందే ఇల్లు ఎలా మంజూరు అయితదని ప్రశ్నిస్తున్నారు ఒకపక్క ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల మంజూరులో వికలాంగులకు ప్రాధాన్యత ఉంటుందని ప్రకటించినప్పటికిని వాస్తవ రూపంగా అమలు కావడం లేదని రాజయ్య ఆవేదన వ్యక్తం చేశారు తనకు పక్క ఇల్లు లేక ఇబ్బందులు పడుతున్నానని ఇందిరా మా పథకంలో ఇల్లు వచ్చిందని అధికారులు ప్రకటించడంతో సంతోషపడ్డాను అన్నారు కానీ స్థానిక నాయకులు కొందరు కావాలని తన ఇల్లును రద్దు చేసినట్లు అనుమానాలు ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు కనీసం మీరైనా తన ఇంటి విషయం అధికారుల దృష్టికి తీసుకెళ్లి మంజూరు అయిందా కాలేదా అనే విషయాన్ని చెప్పాలని బారాస నాయకులు కోరారు ఇండ్లు ఉన్న వారికే ఇల్లు మంజూరు చేశారని పేదలకు మాత్రం మొండి చేయి చూపారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు బాధితుడు పలువురు బారాస నాయకులను కలిసిన వారిలో మాజీ జెడ్పిటిసి పడిగెల రాజేశ్వరరావు మాజీ సర్పంచ్ బద్దం శ్రీనివాస్ రెడ్డి బారాస రాష్ట్ర రైతు విభాగం మాజీ ఉపాధ్యక్షుడు గాదారి అశోక్ రెడ్డి మండల మాజీ కో ఆప్షన్ మెంబర్ అల్తాఫ్ హుస్సేన్ చాకలిరాజయ్య తదితరులను కలిశారు వెంటనే ఎంపీడీవో తో మాట్లాడి సమస్యను పరిష్కారం అయ్యే దిశగా ప్రయత్నిస్తామని హామీ ఇచ్చారు

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed