ప్రముఖ పాత్రికేయులు, సంపాదకులు. రజాకార్ల దౌర్జన్యాలకు భయపడి వరంగల్లు వదిలి వందలాది కుటుంబాలు ఇళ్లు ఖాళీ చేసి వెళ్లిపోతే జనం లేని వీధుల్లో కందిలీ ఒక చేత లాఠీ మరొక చేత పట్టుకుని ప్రతాపరుద్ర దళం కార్యకర్తగా కాపలా కాసిన సాహసి. ఎం.ఎస్.ఆచార్య (మాడభూషి శ్రీనివాసాచార్య) గారి 101 వ జన్మదిన జ్ఞాపకం
అక్టోబర్ 3 హైదరాబాద్:ఎం.ఎస్.ఆచార్య గారు 1924, అక్టోబర్ 3వ తేదీన అమ్మమ్మ గారి గ్రామం సూర్యాపేటలో జన్మించారు. వారి తండ్రి ప్రసన్న రాఘవాచార్య గారు ఉభయ వేదాంత...