వినాయక మండపం, నిమజ్జన సమయంలో తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు, నియమాలు.
ఆగస్టు 19 హైదరాబాద్: గణపతి నవరాత్రులు వస్తున్నాయంటే ప్రతి గ్రామంలో ప్రతి బస్తీలలో వినాయకుని మండపం ఏర్పాటు చేసుకుని తొమ్మిది రోజులు లేదా 11 రోజులు ఘనంగా పూజలు నిర్వహిస్తుంటాం. “మండపంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలా” వర్షాకాలం కరెంటుతో జాగ్రత్తగా ఉండాలి చిన్న పిల్లలకి స్విచ్ బోర్డులు అందకుండా ఎత్తున పెట్టాలి మరియు వైర్లు జైలు లేకుండా చూసుకోవాలి. మండపం దగ్గర వీలైనంతవరకు సిసి కెమెరాలు ఏర్పాటు చేసుకుంటే చాలా బాగుంటది. రాత్రి నిద్రించేటప్పుడు లడ్డు దొంగతనానికి చాలామంది వస్తుంటారు. తొమ్మిది రోజులు 11 రోజులు పూజ పూర్తి చేసుకున్న వినాయకుడు నిమజ్జనం కోసం బయలుదేరేటప్పుడు జాగ్రత్తల గురించి తెలుసుకుందాం. నిమజ్జన సమయంలో కరెంటు తీగలకి ఐరన్ పైపులు తగలకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలామంది ప్రేములు పెద్ద పెద్ద డెకరేషన్ చేస్తారు కానీ వాటి వల్ల చాలా ప్రమాదం జరుగుతుంది. రెండు రోజుల క్రితం కృష్ణాష్టమి వేడుకల్లో కరెంటు షాక్ తో ఐదు మంది చనిపోయారు కొంతమంది ప్రాణాపాయస్థితిలో ఉన్నారు. ఎంత మంచి జాగ్రత్తలు తీసుకుంటాము అంత మంచి వినాయక పండుగ జరుపుకుంటాం. పతి పండుగ కుటుంబంలో సంతోషాన్ని ఇవ్వాలి కానీ దుఃఖాన్ని మిగిల్చకూడదు.