తెలుగు రచయిత, తెలుగు భాషా పండితుడు, పత్రికా సంపాదకుడు/ నిర్వాహకుడు , ప్రముఖ చలనచిత్ర దర్శకుడు. హేతువాది మరియు నాస్తికుడు, వాడుక భాషోద్యమకర్త శ్రీ గిడుగువారి శిష్యుడు తాపీ ధర్మారావు జయంతి సెప్టెంబర్ 19 ని “తెలుగు మాధ్యమాల దినోత్సవం”గా జరుపు కుంటున్నాము. వారికి నివాళులు అర్పిస్తూ…తాపీ ధర్మారావు గారి జయంతిని జ్ఞాపకం చేసుకుందాం
Oplus_131072
సెప్టెంబర్ 19 హైదరాబాద్:తాపీ ధర్మారావు నాయుడు గారు 1887 సంవత్సరంలో సెప్టెంబర్ 19న బెర్హంపూరు (బరంపురం ) జన్మించారు. ధర్మారావు స్వస్థలము శ్రీకాకుళము.వారు కానీ ఒరిస్సాలో ఉన్న బరంపురము లోని ఒక తెలుగు కుటుంబములో తాపీ అప్పన్న నాయుడు, నరసమ్మ దంపతులకు జన్మించారు. తండ్రి వైద్యము చేసేవారు. ధర్మారావు గారి ప్రాథమిక విద్య (1900 )వరకు శ్రీకాకుళములోను,తరువాత విజయనగరం రిప్పన్ ఉన్నతపాఠశాలలోను జరిగింది.తరువాత పర్లాకిమిడిలో ఎఫ్ఫేను,బిఎను పచయప్ప కళాశాలలోను పూర్తిచేసారు. . కల్లికోట రాజావారి కళాశాలలో గణిత ఉపాధ్యాయులుగా పనిచేశారు. పర్లాకిమిడిలో చదివే రోజులలో వ్యవహారిక భాషావేత్త అయిన గిడుగు రామ్మూర్తి వారికి గురువు కావటం విశేషం..
…….
తాపీ ధర్మారావు గారి ఇంటి పేరు మొదట్లో “బండి” లేదా “బండారు” ఆని ఉండేది . వారి తండ్రి అప్పన్న గారి తాత గారు లక్ష్మయ్య కొంతకాలం మిలిటరీలో పనిచేశారు. ఆ తరువాత తాపీ పనిలో ఆ ప్రాంతంలో మంచి పేరు తెచ్చుకొన్నారు. అలా వారికి శ్రీకాకుళంలో “తాపీ లక్ష్మయ్యగారు” అన్న పేరు స్థిరపడిపోయిందట. ఆలా “బండారు” ధర్మారావు గా ఉన్న వారి పేరు తాపీ ధర్మారావు గా ప్రాచుర్యంలోకి వచ్చింది.
….
1910 ప్రాంతంలో కొందరు మిత్రులతో కలిసి బరంపురంలో వేగుచుక్క గ్రంథమాలను స్థాపించారు. మిత్రులతో కలిసి ఒక సంఘంగా ఏర్పడి అభ్యుదయ వాదం, ప్రజా సమస్యలపై చర్చలు చేసేవారు. కొద్దిగా చిత్రకళ కూడా నేర్చుకున్న ధర్మారావు మిత్రులు వేసే నాటకాలకు రచన, నిర్వహణ, వేషధారణ మొదలైన పనులన్నీ చేసేవారు. మ్యాజిక్ కూడా నేర్చుకుని అప్పుడప్పుడూ ప్రదర్శించేవారు. అమిత బలశాలిగా పేరుగాంచిన కోడి రామ్మూర్తి నాయుడు ఈయనకు వ్యాయామ పంతులు.
…..
ఇతని తొలి రచన 1911లో ‘ఆంధ్రులకొక మనవి’ అనే పేరుతో విలువడింది. పత్రికా నిర్వహణలో ఇతని నేర్పు అనన్య సామాన్యమైనది. ధర్మారావు గారు తెలుగు పత్రికారంగము క్రొత్తపుంతలు త్రొక్కుటకు ఆద్యులు.పత్రికారంగములో వాడుకభాషను ప్రవేశపెట్టారు. తెలుగుపత్రికలు కొండెనాగు,జనవాణి, సమదర్శిని లకు సంపాదకులుగ పనిచేసారు. (1940)కాగడా ను ప్రసిద్ద వారపత్రికను స్థాపించారు. అవి వారి ప్రతిభకు అద్దంపట్టాయి. అందుకే
వారి పుట్టినరోజును “తెలుగు మాధ్యమాల దినోత్సవం”గా జరుపుకుంటు గౌరవిస్తున్నాము.
……
తాపీ ధర్మారావు గారు సినిమారంగంలో ప్రవేశించడానికి ముందు భారత సైన్యంలో రేడియో టెలిగ్రాఫిస్టుగా పనిచేశారు. పల్లెటూరి పిల్ల చిత్రంలో బి.ఎ.సుబ్బారావు వద్ద సహాయకునిగా పనిచేశారు. రోజులు మారాయి చిత్రానికి దర్శకత్వంతో పాటు కథను కూడా అందించారు. మాలపిల్ల (1938), రైతుబిడ్డ (1939), కీలుగుర్రం (1949) పల్లెటూరిపిల్ల (1950) రోజులు మారాయి (1955) వంటి పలు సినిమాలకు సంభాషణలు రాశారు. . తెలుగుతోపాటు హిందీ, తమిళ చిత్రాలకు దర్శకత్వం వహించారు.
విశేషాలు
1) ఉమ్మడి మద్రాసు రాష్ట్రం ముఖ్యమంత్రిగా బొబ్బిలి రాజా ఉన్నప్పుడు- తాపి ధర్మారావు గారు ఆయన దగ్గర కార్యదర్శిగా పనిచేశారు.
2) ఆంధ్ర రాష్ట్ర పత్రికా రచయితల మహాసభ జరిగినప్పుడు తాపీవారే మొదటి అధ్యక్షులు.
3) తాపీ ధర్మారావుని గౌరవంగా ‘తాతాజీ’ అని పిలిచేవారు.
▪️వారికి లభించిన గౌరవాలు సత్కారాలు….
1) ఉమ్మడి మద్రాసు రాష్ట్రంగా వున్న రోజుల్లో బొబ్బిలి రాజా వారు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నప్పుడు, ధర్మారావుగారు ఆయన దగ్గర కార్యదర్శిగా పనిచేశారు
2) ఆంధ్ర రాష్ట్ర పత్రికా రచయితల మహాసభ జరిగినప్పుడు తాపీవారే మొదటి అధ్యక్షులు
3) ఆంధ్ర సాహిత్య అకాడమీ వారినకి విశిష్టసభ్యత్వము ఇచ్చి గౌరవించింది.
4) శ్రీ వేంకటేశ్వరవిశ్వవిద్యాలయము సెనేట్ సభ్యునిగ నియమింపబడ్డారుతెలుగుభాషకు వారు చేసిన అసాధరణ సేవకు గుర్తింపుగ శృంగేరి పీఠాధిపతులు జగద్గురు చంద్రశేఖర భారతీ శంకరాచార్యుల వారి నుండి 1926లో ‘ఆంధ్రవిశారద’ బిరుదుపొందారు,.
5) చేమకూరి వెంకటకవి రచించిన ‘విజయవిలాసం’ కావ్యానికి చేసిన ‘హృదయోల్లాస వ్యాఖ్య’కు 1971లో కేంద్రసాహిత్య అకాడమీ పురస్కారముపొందారు.
▪️వారి రచనలు కొన్ని…
1)దేవాలయాలమీద బూతుబొమ్మలు
2) పెళ్ళి, దాని పుట్టుపూర్వోత్తరాలు
3) ఇనుపకచ్చడాలు
4) పాతపాళీ కొత్తపాళీ
5) ఆల్ ఇండియా అడుక్కునేవాళ్ళ మహాసభ
6) సాహిత్యమొర్మరాలు
……
పత్రికా నిర్వహణలో వారికి మంచి పేరు ఉంది. కొండెగాడు, సమదర్శిని, జనవాణి, కాగడా మొదలైన పత్రికలు ఇతని ప్రతిభకు నిదర్శనాలు. తాపి ధర్మారావు గారు 1973 మే 8న మరణించారు. తెలుగు సినిమా దర్శకులు తాపీ చాణక్య తాపి ధర్మారావు గారి కుమారుడు.