సిగాచి కెమికల్ ఫ్యాక్టరీలో జరిగిన రియాక్షన్ బ్లాస్ట్ లో గాయపడ్డ కార్మికులను పరామర్శించారు మంత్రి వివేక్ వెంకట్ స్వామి
జూన్ 30: హైదరాబాద్ సబర్బ్‌లోని సిగాచి కెమికల్ ఫ్యాక్టరీలో జరిగిన రియాక్షన్ బ్లాస్ట్ లో గాయపడ్డ కార్మికులను తెలంగాణ రాష్ట్ర కార్మిక మరియు గనుల శాఖ మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి గారు పరామర్శించారు.ప్రణమ్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న బాధితులను కలిసి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న మంత్రి గారు, వారి కుటుంబాలకు ప్రభుత్వం తరఫున అండగా నిలుస్తానని హామీ ఇచ్చారు.ఈ ఘటనపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన మంత్రి గారు, ఫ్యాక్టరీ యాజమాన్యం నుండి పూర్తి నివేదిక కోరారు. కార్మికుల భద్రతే ప్రథమ ప్రాధాన్యత అనే ఉద్దేశంతో, భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.“కార్మికుల హక్కులను పరిరక్షించడమే మా బాధ్యత. బాధితుల కుటుంబాలకు అన్ని విధాలుగా సాయం అందేలా చూస్తాం,” అని మంత్రి గారు స్పష్టం చేశారు.