సబితా ఇంద్రారెడ్డి గారి అవగాహన లోపం వల్లే నీట మునిగిన మహేశ్వరం మోడల్ స్కూల్, కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం మరియు అగ్నిమాపక కేంద్రం – శ్రీరాములు అందెల
నవంబర్ 5 మహేశ్వరం:మహేశ్వరం నియోజకవర్గం మహేశ్వరం మండల కేంద్రంలో నిన్న కురిసినటువంటి భారీ వర్షాలకు రామచంద్ర గూడెం లోని చెరువుకు గండిపడడంతో గ్రామంలోకి నీరు భారీగా పోటెత్తడం ఇళ్లలోకి నీరు చేరి భయాందోళనకు గురయ్యారు అలాగే కస్తూర్బా బాలికల పాఠశాల, మోడల్ స్కూల్ మరియు అగ్నిమాపక కేంద్రం లోకి వరద ముంచెత్తింది..విషయం తెలుసుకున్న రంగారెడ్డి జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల కన్వీనర్, మహేశ్వరం నియోజకవర్గం బిజెపి ఇంచార్జ్ అందెల శ్రీరాములు గారు ఈరోజు అట్టి స్థలాలకు చేరుకొని స్థానిక బిజెపి నాయకులతో కలిసి సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా శ్రీరాములు గారు మాట్లాడుతూ కేవలం సబితా ఇంద్రారెడ్డి అవగాహన లోపం వల్లే ఈరోజు ఈ దుస్థితి నెలకొందన్నారు…మహేశ్వరంలో అనేక చెరువులు, కుంటలు, కాలువలు మాయమవుతున్న తాను పట్టించుకోవడంలేదని తన హయాంలోనే మోడల్ స్కూల్ గాని, కస్తూర్బా పాఠశాల గాని, అగ్నిపాపక కేంద్రం గాని నిర్మించారని…కనీసం ఇరిగేషన్ అధికారులతో సమీక్ష నిర్వహించకుండా ఇట్టి స్థలాలలో ఈ నిర్మాణాలు పూర్తి చేశారని గుర్తు చేశారు. ప్రైవేట్ కంపెనీలకు ఎత్తు స్థలాలు కేటాయించి నిరుపేదలు చదువుకునే పాఠశాలలకు లోతట్టు ప్రాంతాలలో భూమిని కేటాయించడం, నిర్మాణం చేపట్టడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే హైడ్రా అధికారులు కూడా గ్రామాలలో పర్యటించి అన్యాక్రాంతం అవుతున్న చెరువులను, కాలువలను గుర్తించి ఇక్కడి ప్రజలకు మునుముందు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ కుండే వెంకటేష్, జిల్లా కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శి, మాజీ ఎంపీటీసీ సభ్యులు పోతర్ల సుదర్శన్ యాదవ్, జిల్లా బిజెపి కార్యదర్శి యాదయ్య గౌడ్, మండల బిజెపి ప్రధాన కార్యదర్శి వనంపల్లి శ్రవణ్, ఉపాధ్యక్షులు చెన్నా రెడ్డి, నరసింహ, మండల కార్యదర్శి దేవేందర్, మాజీ ప్రజాప్రతినిధులు సురేష్, శ్రీరాములు యాదవ్, రఘువీర్, జాపాల సుధాకర్, బీజేవైఎం నాయకులు దేవేందర్, సీనియర్ నాయకులు కాకి పరమేష్, పాండు నాయక్, గణేష్ నాయక్, వెంకటేష్ నాయక్, శ్రీకాంత్ నాయక్, నరేష్, గణేష్ తదితరులు పాల్గొన్నారు.