షాద్ నగర్ బస్ డిపో ఎదుట ఎమ్మెల్యే శంకర్ బైఠాయింపుషాద్ నగర్ లో తెల్లవారు జామున 4 గంటలకే బంద్.కాంగ్రెస్, సిపిఎం, సీపీఐ, బిసి జేఏసీ, బీసీ సేన, ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘాల ఆందోళన.42 శాతం రిజర్వేషన్లపై హైకోర్టు స్టేకు నిరసనగా బీసీ జేఏసీ పిలుపు,అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల మద్దతు
అక్టోబర్ 18 షాద్ నగర్:రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కల్పనపై హైకోర్టు ఇచ్చిన స్టేను నిరసిస్తూ బీసీ సంఘాల జేఏసీ శనివారం తెలంగాణ బంద్ నిర్వహించింది. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణ కేంద్రంలో స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ రంగ సంస్థల చైర్మన్ వీర్లపల్లి శంకర్ నేతృత్వంలో కాంగ్రెస్ సిపిఎం సిపిఐ బిసి సెల్, ఎన్ ఎస్ యు ఐ, ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ విద్యార్థి, తదితర పార్టీలు ప్రజాసంఘాలు భారీ ఎత్తున మద్దతు పలికాయి. ఈ బంద్‌కు రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలతోపాటు పలు ప్రజాసంఘాలు మద్దతు తెలిపాయి. షాద్ నగర్ బస్ డిపో ఎదురుగా ఉదయం 3 గంటలకే చేరుకుని బస్సులు బయటికి రాకుండా ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ తదితరులు అడ్డుకున్నారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారీ ఎత్తున నినాదాలు తెలియజేశారు. విద్యాసంస్థలు, వ్యాపార వర్గాలు స్వచ్ఛందంగా బంద్‌లో పాల్గొనాలని బీసీ జేఏసీ కోరడంతో ఆయా వర్గాలు కూడా సానుకూలత వ్యక్తం చేశాయి. కొన్ని ఇంజనీరింగ్ కాలేజీలు, విద్యాసంస్థలు సెలవు ప్రకటించాయి. కాగా, బంద్‌కు టీజీఎ్‌సఆర్టీసీ కూడా మద్దతు తెలపాలని బీసీ సంఘాలు కోరాయి. దీనిపై ఆర్టీసీ కార్మిక సంఘాలు కూడా కొంతమేర సుముఖత వ్యక్తం చేశాయి. అయితే ఉదయం బంద్‌లో పాల్గొని, తీవ్రత తగ్గిన తరువాత బస్సులు నడపాలని ఆర్టీసీ సంఘాలు నిర్ణయించాయి. కాగా, బీసీల బంద్‌కు అధికార కాంగ్రెస్ పూర్తి మద్దతునిస్తున్నట్టు ప్రకటించింది. ఆ ప్రకారంగా వారి ముందుండి ఉద్యమాన్ని నడిపేందుకు సిద్ధమయ్యారు. బీసీలకు రిజర్వేషన్ల విషయంలో వెనకడుగు వేసేది లేదని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ తెలిపారు. కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలంతా బంద్‌లో పాల్గొని విజయవంతం చేయాలని నిన్ననే పిలుపునిచ్చారు. తెల్లవారుజాము నుండి కాంగ్రెస్ సిపిఎం సిపిఐ తదితర పార్టీలు బంద్ లో పాల్గొన్నాయి..