శ్రీరామ జయ మంత్రంసకల కార్య సిద్ధికి ప్రతి రోజు పఠించవలెను
జూలై 2:(1) నమోస్తు రామాయ స లక్ష్మణాయ
దేవ్యైచ తస్యై జనకాత్మజాయై !
నమోస్తు రుద్రేన్ద్ర యామానిలేభ్యో
నమోస్తు చంద్రార్క మరుద్గణేభ్యహ !!
తా!! లక్ష్మణ సహితుడగు శ్రీ రామునికి మ్రొక్కెదను. జనకమహారాజ పుత్రికయగు సీతాదేవికి నమస్కారము చేసెదను. రుద్రా, ఇంద్ర, యమ, వాయువులకు జోహారోనర్చెదను. చంద్ర సూర్యాదిదేవతలకు చేతులు మోడ్చెదను.
(2) జయత్యతి బలో రామో లక్ష్మణశ్చ మహాబలః !
రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభి పాలితః !!
తా!! మహాబలుడగు రాముడు జయంబు కల్గి ఉన్నవాడు. మహాబలుడగు లక్ష్మణుడున్నూ జయంబు కల్గియున్నవాడు. వానరరాజగు సుగ్రీవుడును రామునిచే పరిపాలితుడై జయంబు కల్గి యున్నవాడు.
(3 ) దాసోహం కోసలేంద్రస్య రామస్యాక్లిష్ఠ కర్మణః !
హనుమాన్ శత్రు సైన్యానాం నిహన్తా మారుతాత్మజః !!
తా!! ఎట్టి కార్యంబునందును కాలేశంబు నొందని వాడును , కోసల దేశాధీశుడగు శ్రీ రామునకు నేను దాసానుదాసుడను ; హనుమంతుడను పేరు గలవాడను ; శత్రుసైన్యంబులను జంపు వాడను ; వాయుదేవుని కుమారుడును.
(4) న రావణ సహస్రం మే యుద్ధే ప్రతిబలం భవేత్ , !
శిలాభిస్తు ప్రహారతః పాదపైశ్చ సహస్రశః !!
తా!! రాళ్లచేతను, వృక్షముల చేతను, వేయి విధంబులఁ ప్రహరించుచు విహారముసేయుచుండు నాకు, యుద్ధమున వేయి మంది రావణులును సరి కాజాలరు.
(5) అర్థయిత్వా పురీం లంకా మభివాద్యచ మైథిలీం , !
సమృద్ధార్ధో గమిష్యామి మిషదాం సర్వ రాక్షసాం !!
తా!! నేను రాక్షసులందరునూ చూచు చుండగానే యా లంకా పట్టణమంతయూనశింప చేసి , సీతాదేవికి నమస్కారము చేసి కృతార్థుడనై రాముని యొద్దకు బోయెదను. యని హనుమంతుడు గట్టిగా యరచెను.
┈┉━❀꧁శ్రీ ఆంజనేయం꧂❀━┉┈
ఆధ్యాత్మికం బ్రహ్మానందం
🐒🏹🐒 🙏🕉️🙏 🐒🏹🐒