విలేకరుల పిల్లల విద్యకు రాయితీ ఇవ్వాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి కోరిన ఈ.పద్మారావు కాపు
నవంబర్ 10 రంగారెడ్డి:రంగారెడ్డి జిల్లా కొంగరికలాన్లో ఉన్న జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ సి.నారాయణ రెడ్డిని సోమవారం మర్యాదపూర్వకంగా కలిసిన అన్వేషణ రంగారెడ్డి జిల్లా ప్రతినిధి ఈ.పద్మారావు కాపు విలేకరుల పిల్లల స్కూల్ ఫీజులో రాయితీ కల్పించాలని విజ్ఞప్తి చేశారు.విలేకరులు సమాజానికి అద్దం పట్టే వృత్తిలో నిరంతరం కష్టపడి పనిచేస్తున్నారని,చాలామంది ఆర్థిక ఇబ్బందులతో పిల్లల విద్యాభ్యాసం భరించడంలో ఇబ్బందులు పడుతున్నారని ఆయన వివరించారు.ప్రభుత్వం మరియు విద్యాశాఖ తరఫున జర్నలిస్టుల కుటుంబాలకు ప్రోత్సాహక చర్యలు చేపట్టాలని కోరారు.కలెక్టర్ సి.నారాయణ రెడ్డి ఈ ప్రతిపాదనపై సానుకూలంగా స్పందించారు.ఈ సందర్భంగా ఈ.పద్మారావు మాట్లాడుతూ:-విద్య ప్రతి కుటుంబానికి ప్రాధమిక హక్కు.జర్నలిస్టులు ప్రజల సమస్యలను వెలుగులోకి తెస్తారు.అలాంటి విలేకరుల పిల్లల విద్యకు చిన్న సహాయం అయినా పెద్ద ప్రోత్సాహమే అని పేర్కొన్నారు.