విద్యార్థుల హక్కుల కోసం అశోక్ సార్ నిరాహార దీక్ష
మన ఊరి న్యూస్ హైదరాబాద్ ప్రతినిధి ఈ.పద్మారావు కాపు సెప్టెంబర్ 22: అశోక్ సార్,ఎంతో మంది విద్యార్థులను తీర్చిదిద్దిన వ్యక్తి,ఈ రోజు తన విద్యార్థుల హక్కుల కోసం నిరాహార దీక్ష ప్రారంభించారు.ప్రస్తుతం ఆయన ఆరోగ్యం బాగాలేదు అని ఉస్మానియా హాస్పిటల్‌లో అడ్మిట్ చేశారు.అశోక్ నిరాహార దీక్షకు కారణం ప్రభుత్వం విద్యార్థుల,నిరుద్యోగుల సమస్యలను పట్టించుకోకపోవడం.విద్య,ఆరోగ్యం,పవర్, ప్రభుత్వ సెక్టార్‌లకు చెందిన విద్యార్థులు, నిరుద్యోగులు అశోక్ సార్‌ను కలుసుకోవడానికి ప్రయత్నించినప్పటికీ,అధికారులు వారిని అడ్డుకుంటున్నారు.నిరుద్యోగులు,విద్యార్థులు ఆరోపిస్తున్నట్లు,తొమ్మిది రోజులుగా నిరాహార దీక్ష కొనసాగుతున్నా ప్రభుత్వ పరిష్కారం లేదు.ప్రస్తుతం డీఎస్సీలో ఖాళీగా ఉన్న ఉద్యోగ భర్తీలు పూర్తి చేయాలి, ఉన్నవాళ్లకి ప్రమోషన్లు ఇచ్చి మేము ఉద్యోగాలు ఇచ్చామని చెప్పుకుంటున్నారు కానీ కొత్త ఉద్యోగాల్ని ఎక్కడ???మళ్లీ నోటిఫికేషన్లు వేయాలని డిమాండ్ చేస్తున్నారు.పలు స్కూల్‌లలో టీచర్ల కొరత కారణంగా విద్యార్థులకు సరైన విద్య అందడం కష్టమవుతోంది.ప్రస్తుత ప్రభుత్వం వైద్య ఉద్యోగులకు ప్రమోషన్లు ఇచ్చినప్పటికీ, ఖాళీ ఉద్యోగ భర్తీలను పూరించడంలో విఫలమవుతోంది. గత ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలను ఇప్పుడు ఇచ్చినట్లు ప్రస్తుత ప్రభుత్వం స్వయంగా గొప్పలు చెప్పడం మాత్రమే జరుగుతోందని నిరుద్యోగులు విమర్శించారు.అశోక్ సార్ మాట్లాడుతూ,విద్యార్థులు,నిరుద్యోగులు కోసం నిలబడడం తప్ప,ప్రభుత్వం ఏదీ చేయడం లేదు. నోటిఫికేషన్లు ప్రకటించబడకపోవడం,అధికారులు నిర్లక్ష్యం తీరడం వల్ల నిరుద్యోగులు,విద్యార్థులు కష్టాల్లో ఉన్నారు అని పేర్కొన్నారు.తెలంగాణ ప్రభుత్వం,విద్య, ఉద్యోగ భర్తీలలో తక్షణ పరిష్కారం తీసుకోవాలని, విద్యార్థుల హక్కులను రక్షించమని అశోక్ సార్ కోరుతున్నారు.