February 22, 2026

వికారాబాద్ అనంతగిరిలో ఏపీ, తెలంగాణ డిసిసి అధ్యక్షులకు పది రోజుల శిక్షణా శిబిరం ప్రారంభం.ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హాజరయ్యారు. టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్

0
Oplus_131072

Oplus_131072

ఫిబ్రవరి 22 వికారాబాద్: “సంఘటన సృజన్ అభియాన్” కార్యక్రమం భాగంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల జిల్లా కాంగ్రెస్ కమిటీ (డిసిసి) అధ్యక్షుల కోసం నిర్వహిస్తున్న పది రోజుల ప్రత్యేక శిక్షణా శిబిరం ఘనంగా ప్రారంభమైంది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హాజరయ్యారు. టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారు, ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల గారు,సీడబ్ల్యూసీ సభ్యులు చల్లా వంశీ చందర్ రెడ్డి గారు, ఏఐసీసీ ఇంచార్జీ కార్యదర్శి సచిన్ సావంత్ గారు, మంత్రులు శ్రీధర్ బాబు గారు,పొన్నం ప్రభాకర్ గారు,పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి గారు,ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి గారు,తదితరులు పాల్గొన్నారు.

సంఘటన సృజన్ ప్రోగ్రామ్ చైర్మన్ ఆధ్వర్యంలో, ఆర్గనైజింగ్ సెక్రటరీ వంశీ చందర్ రెడ్డి, చైర్మన్ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి నేతృత్వంలో ఈ శిక్షణా శిబిరం నిర్వహించబడుతోంది. పది రోజుల పాటు జరిగే ఈ శిబిరంలో నాయకత్వ నైపుణ్యాలు, ప్రజా సమస్యల పరిష్కార విధానాలు, ఎన్నికల వ్యూహాలు, మీడియా నిర్వహణ తదితర అంశాలపై సమగ్ర శిక్షణ అందించనున్నారు.

ఈ శిబిరం ద్వారా ఏపీ, తెలంగాణ కాంగ్రెస్ సంస్థాగతంగా మరింత పటిష్టమవుతుందని నాయకులు ఆశాభావం వ్యక్తం చేశారు.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed