రోడ్డు సమస్యకు ఇబ్బందులు పడుతున్న కోలాన్ గూడా ప్రజల కోసం మన ఊరి న్యూస్ ప్రచురించిన కోలాన్ గూడా–ఎలిమినేట్ రహదారి వార్తపై మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెంటనే స్పందన
మన ఊరి న్యూస్ రంగారెడ్డి జిల్లా ప్రతినిధి ఈ.పద్మారావు కాపు సెప్టెంబర్ 22:రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం కందుకూరు మండలం కోలాన్ గూడా–ఎలిమినేట్ రహదారి పరిస్థితి దారుణంగా ఉందని గ్రామస్తులు కొంతకాలంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.రోడ్డు లేక బైకులు బోల్తా పడుతూ ప్రజలు ప్రయాణానికి పెద్ద ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యను మన ఊరి న్యూస్ పత్రికలో ప్రచురించిన తరువాత, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెంటనే స్పందించి, గ్రామస్తులతో కలసి పరిస్థితిని పరిశీలించారు.సంబంధిత అధికారులను ఫోన్ చేసి,ఒక నెలలో రోడ్డు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ గీతా గణేష్,బీసీ సెల్ అధ్యక్షులు,గ్రామ పెద్దలు మరియు పెద్ద సంఖ్యలో స్థానికులు పాల్గొన్నారు