రాష్ట్రీయ మహాకాల్ సేన-భారత దక్షిణ భారత ప్రత్యేక సలహదారుడిగా రామ్ తిలక్ నియామకం
నవంబర్ 18 హైదరాబాద్: రాష్ట్రీయ మహాకాల్ సేన(భారత్) కేంద్ర కమిటీ,హైదరాబాద్కు చెందిన శ్రీ రామ్ తిలక్ గారిని “దక్షిణ భారత ప్రత్యేక సలహాదారులు గా అధికారికంగా నియమించింది. ఈ నియామక ఉత్తర్వును మహంత్ యోగి రోహితాస్ నాథ్ జీ (రాష్ట్ర అధ్యక్షులు) 03 అక్టోబర్ 2025న జారీ చేశారు. కేంద్ర కమిటీ వెల్లడించిన ప్రకారం, రామ్ తిలక్ నిబద్ధత, సేవా తత్వం, ప్రజా కార్యక్రమాల్లో పాల్గొనే తీరు మరియు సంస్థ పట్ల చూపుతున్న అనురాగాన్ని పరిగణనలోకి తీసుకుని ఈ కీలక బాధ్యతను అప్పగించినట్లు తెలిపారు. ఈ పదవిలో భాగంగా ఆయన దక్షిణ భారతంలోని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక మరియు కేరళ రాష్ట్రాల్లో సంస్థ కార్యకలాపాలు, విస్తరణ, సమన్వయం మరియు మార్గనిర్దేశనం బాధ్యతలను చేపట్టనున్నారని కమిటీ పేర్కొంది.ఈ పదవి గౌరవప్రదమైనదైనప్పటికీ, సంస్థ అభివృద్ధి, సేవా విస్తరణ మరియు జాతీయ ఏకత సాధనలో కీలకమైన పాత్ర పోషిస్తుంది. రామ్ తిలక్ నియామకం సంస్థకు నూతన శక్తిని తీసుకురావడం ఖాయమని మహాకాల్ సేన కేంద్ర ప్రధాన కార్యదర్శి తెలిపారు. సంస్థ సభ్యులు రామ్ తిలక్ కి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆయన నాయకత్వంలో దక్షిణ భారత కార్యకలాపాలు మరింత బలోపేతం అవుతాయని నమ్మకం వ్యక్తం చేశారు.