రాయల వారి వర్ధంతి అక్టోబరు 17న “హొన్నేనహళ్ళి లో రాయలవారి మరణ శాసనంశ్రీక్రిష్ణదేవరాయల మరణానికి సంబంధించి ఖచ్చితమైన సమాచారం లభించింది”.
అక్టోబర్ 17 హైదరాబాద్: రాయల వారి వర్ధంతి అక్టోబరు 17న హొన్నేనహళ్ళి లో రాయలవారి మరణ శాసనం.
శ్రీక్రిష్ణదేవరాయల మరణానికి సంబంధించి ఖచ్చితమైన సమాచారం లభించింది. అప్పటివరకు లభించిన ఆధారాలను బట్టి రాయలవారు 1530లో స్వర్గస్తుడయ్యాడని చరిత్ర పుస్తకాల్లో రాశారు. కానీ కర్ణాటకలోని తుముకూరు సమీపంలోని హొన్నేనహళ్ళి వద్ద దొరికిన ఒక శాసనం శ్రీక్రిష్ణదేవరాయలు 1529 అక్టోబర్ 17న మరణించినట్టు చెబుతున్నది. క్రిష్ణ రాయలు మరణించిన సందర్భంగా వారి ఆత్మకు శాంతి కలగాలని తుముకూరు సీమ ప్రజల తరఫున ఆప్రాంత కార్యకర్త భీమపణ నాయక తుముకూరు వీర ప్రసన్న ఆంజనేయస్వామి గుడికి ఇచ్చిన దానాన్ని శాసనం తెలుపుతున్నది. పెనుకొండ రాజ్యంలోని ఆనెబిద్ద స్థలo తుముకూరు సీమకు చెందిన హొన్నేనహళ్ళి అని శాసనంలో రాశారు. శాలివాహన శకవర్షం 1451 విరోధి సంవత్సర కార్తీక శుద్ధ 15 ఆదివారం నాడు రాయలవారు మరణించినట్టు శాసనం వివరిస్తున్నది. హొన్నేనహళ్ళి శాసనాన్ని చరిత్ర కారుడు ఆచార్య కేఆర్ నరసింహన్ 2022లో కనుగొని పరిష్కరించారు. శాసన పరిశోధకుడు ధనపాల్ తదితరులు శాసన విషయాన్ని వెలికితీయడానికి కృషి చేశారు.
ఇదిలావుండగా చరిత్రకారుడు మైనాస్వామి హొన్నేనహళ్ళి ని ఇటీవల సందర్శించారు.