యోగ సేవలో పాతికేళ్ళు: అల్కాపురి కాలనీ పతాంజలి యోగా కేంద్రం రజతోత్సవం ఘనంగా నిర్వహణ
నవంబర్ 30: మహేశ్వరం నియోజకవర్గం రామకృష్ణాపురం డివిజన్ అల్కాపురి కాలనీ కమ్యూనిటీ హాల్ లో యోగ గురువులు శ్రీ ధర్మ వీర్ గారి ఆధ్వర్యంలో పతాంజలి యోగా కేంద్రం రజతోత్సవం నిర్వహించడం జరిగింది.. కార్యక్రమంలో ప్రొఫెసర్ చెన్నప్ప ఆర్షకవి ప్రణవ్ కుమార్ నిజాంబాద్ పద్మక్క మంకాళ విజయ్ వాసప్రస్థ బాణాల ప్రభాకర్ వాసప్రస్థ *బచ్చు రాజు ప్రకాష్ * రామకృష్ణాపురం డివిజన్ మాజీ కార్పొరేటర్ GHMC డిప్యూటీ ఫ్లోర్ లీడర్ దేప సురేఖ భాస్కర్ రెడ్డి గారు మరియు ఆర్గనైజర్ దామోదర్ రెడ్డి,అనిత,అనంతలక్ష్మి, పిట్ట సుమతి మీనాకుమారి, మాధవి లత, మంజుల, శ్రీనివాస్ , ధనలక్ష్మి నాగనందిని పలు జిల్లా యోగ సాధనకులు కాలనీ వాసులు తదితరులు పాల్గొనారు.. సందర్భంగా గురువుగారు మాట్లాడుతూ. 👉 అల్కాపురి కాలనీ పతాంజలి యోగా కేంద్రం గత 25 సంవత్సరాలుగా వేలాది మంది ప్రజల ఆరోగ్యానికి, మానసిక ప్రశాంతతకు కేంద్రంగా నిలిచిందని తెలిపారు. 👉”ప్రతి ఇంటికీ యోగాను తీసుకువెళ్లడమే మా లక్ష్యం. నేటి ఆధునిక జీవనశైలిలో యోగా అనేది కేవలం వ్యాయామం కాదు, అదొక సంపూర్ణ జీవన విధానం,” అని ఆయన ఉద్ఘాటించారు. 👉నిరంతర సహకారం అందించిన స్థానిక ప్రజలకు, ప్రజాప్రతినిధులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.👉యోగ ద్వారా ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించడంలో యోగా కేంద్రాల పాత్ర ఎంతో గొప్పది. ఈ కేంద్రం మరిన్ని దశాబ్దాలు పాటు ప్రజలకు సేవ చేయాలని కోరుకుంటున్నాను,” అని అన్నారు.